ప్రస్తుత కాలంలో  మనం జీవిస్తున్న ఆధునిక ప్రపంచంలో, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న సరికొత్త టెక్నాలజీని మనం చూస్తూనే ఉన్నాము..అలాగే ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరి నోట  వింటూనే ఉంటాము.. అయితే ఇవన్నీ మనము కూడా తెలుసుకోవాలంటే  అన్ని రంగాలపైనా మనకు అవగాహన ఉండాలి. అప్పుడే ప్రపంచం నలుమూలల ఏం జరుగుతుందో అనే విషయం కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీకు ఒకే వేదిక తారసపడుతుంది. ఆ వేదిక ఏమిటంటే "ఇండియా హెరాల్డ్" . ఇండియా హెరాల్డ్ ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను మీకు చూపిస్తూ మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించాలనే నెపంతో ఎప్పటికప్పుడు మంచి మాటలను మీ ముందుకు తీసుకొస్తుంది.. అందులో భాగంగానే ఈరోజు మంచి మాట ఏమిటంటే..ప్రయత్నం మానేస్తే మరణించినట్టే.. ప్రయత్నం చేస్తూ మరణిస్తే జయించినట్టే..!

దీని అర్థం ఏమిటంటే.. ఏదైనా ఒక విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం తప్పకుండా చేయాలి. అలాంటి ప్రయత్నం లో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అదరకుండా, బెదరకుండా ఆ ప్రయత్నం సఫలం అయ్యేవరకు కష్టపడాలి. ఒకవేళ కష్టం ఎదురైందని మధ్యలోనే ఆపేస్తే మరణించిన వారితో సమానం. అయితే అదే విజయాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేస్తూ మరణించినా అది విజయం సాధించినట్టు.. కాబట్టి ప్రయత్నం చేయకుండా ఉండే కన్నా ప్రయత్నం చేసి మరణించడం ఎంతో ఉత్తమమైన పని..


ఉదాహరణకు మీరు ఏదైనా ఒక రంగంలో విజయం సాధించాలంటే ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఒక ప్రయత్నంలో విజయం పొందాలి అంటే ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అలాంటి అన్ని పరిస్థితులను ఛేదించుకుంటూ వెళ్ళినప్పుడు వీరుడు, ధీరుడు అవుతాడు. మార్గం మధ్యలో ఎన్ని కష్టాలు ఎదురైనా చివరకు విజయాన్ని సాధించే వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పుడే మనిషి జీవితానికి ఒక సార్థకత ఏర్పడుతుంది.కాబట్టి ప్రయత్నం అనేది ప్రతి ఒక్కరు చేయాలి. కానీ ప్రయత్నం మాత్రమే చేస్తే సరిపోదు. విజయం సాధించే వరకు ప్రయత్నించాలి. అప్పుడే ఒక విషయాన్ని సాధించగలము..


మరింత సమాచారం తెలుసుకోండి: