ప్రతిసారి మీలో చైతన్య నింపడం కోసం ఇండియా హెరాల్డ్ తరఫున, మేము కూడా మీ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాము.. ఎప్పటికప్పుడు వినూత్నమైన ఆలోచనలను అందరిలో తీసుకురావాలని, అలాగే మంచి మార్గంలో నడిపించాలని, సత్యం, ధర్మం, అహింస వంటివి విడనాడకుండా జీవితంలో ఎదురయ్యే అన్ని కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ, ముందుకు సాగిపోవాలని ఎప్పుడూ మీకోసం ఆలోచిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్.. ఇక అందులో భాగంగానే,  ఎప్పటికప్పుడు మీ కోసం ఒక మంచి మాటను తీసుకు వచ్చినట్టుగానే ఈరోజు కూడా ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకు వచ్చింది.. అదేమిటంటే..ఓపిక చాలా విలువైనది.. ఎంత ఓపికగా ఉంటామో.. జీవితంలో అంత సాధించవచ్చు..


దీని అర్థం ఏమిటంటే.. జీవితంలో ఓర్పు అనేది చాలా ప్రధానమైనది.. మనం ఎంత ఓర్పుగా ఉంటామో అంతే స్థాయిలో జీవితంలో ఏదైనా సాధించవచ్చు.. కోపం అప్పటికప్పుడే పనికి వస్తుంది. కోపం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా బుద్ధిని కోల్పోయి బుద్ధి హీనులు అవుతారు.. కాబట్టి కోపాన్ని విడనాడి ఓపికను తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి.. ఎప్పుడైతే ఓపికగా ఉంటామో అప్పుడు స్వర్గాన్ని జయించిన వారమవుతాము.. అని దీని అర్థం..


ఉదాహరణకు మీరు ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మీకు సహనం అనేది ఎంతో ముఖ్యం. ఓపిక లేకుండా చేసే ఏ పని అయినా సరే అది పూర్తవదు.. జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు సహనాన్ని కోల్పోయి, విచక్షణారహితంగా ప్రవర్తిస్తే,పోయేది మన ప్రాణమే తప్పా చివరకు ఏమీ మిగలదు.. కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో ఓపికతో ప్రతి దానిని పరిష్కరించుకుంటూ వెళ్లాలి. ఏదో చిన్న సమస్య ఎదురైందని మనస్థాపం చెంది, ఆత్మహత్య చేసుకుంటున్న సమాజంలో బ్రతుకుతున్నాము.. కాబట్టి అలాంటి వారిలో చైతన్యం నింపడం కోసం మేము మీ ముందుకు ఎప్పటికప్పుడు ఒక మంచి మాట రూపంలో నిజమైన సత్యాలను చెబుతూనే ఉన్నాము.. కాబట్టి మీరు కూడా ధైర్యంగా ఉంటూ, ప్రతి పనిని ఓపికతో చేసుకుంటూ,అత్యంత విజయాలను సాధించాలని మేము కూడా ఆశిస్తున్నాము..


మరింత సమాచారం తెలుసుకోండి: