ఏది జరిగినా మన మంచికే.. అనే ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే నేను మీకు ఒక కథను వినిపిస్తాను.. ఆ కథ ఏమిటో మీరు కూడా ఒకసారి తెలుసుకోండి.. ఒకానొక ఊరిలో ఒక రాజు, ఒక మంత్రి ఉండేవారు.. ఏ సమస్య ఎదురైనా రాజు, మంత్రిని మాత్రమే ఆ సమస్యకు పరిష్కారం చెప్పమని అడుగుతుండేవారు.. ఇక అందుకు మంత్రి సమాధానంగా ఏం జరిగినా మన మంచికే జరిగింది రాజా అంటూ బదులిచ్చేవాడు..

ఒక రోజు ఒక సమయంలో  రాజు ఏదో తన పనిలో నిమగ్నమై ఉండగా, అనుకోకుండా అతని ఐదు చేతి వేళ్లలో ఒక వేలు తెగిపోయింది. అప్పుడు రాజుగారు మంత్రి ని ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు
ఇక మంత్రి ఇది కూడా మన మంచికే జరిగింది రాజా అని సమాధానమిచ్చాడు. ఆ మాట విన్న రాజు కోపోద్రిక్తుడై.. సరే సరే నీకు ఎగతాళిగా ఉందా.. అని అనుకొని ,మంత్రిని అడవికి తీసుకెళ్లాడు రాజు.. ఆ అడవిలో ఒక బావి దగ్గరికి తీసుకువెళ్లి , మంత్రిని బావి లోపల కు వదిలి , తాడు సహాయంతో నీళ్లు తీసుకు రమ్మని చెప్పాడు.  మంత్రి బావి లోకి దిగిన తర్వాత ఆ తాడును కూడా బావిలో పడవేసి నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పి రాజు అక్కడ నుండి వెళ్ళిపోయాడు.


ఇక అక్కడి నుండి తిరిగి రాజు వస్తుండగా, మార్గం మధ్యలో కొంతమంది కోయ జాతి వారు ఆ రాజును బంధించి, వారి కుల పెద్ద దగ్గరకు తీసుకెళ్లారు. వారు వారి కుల పెద్ద తో మన దేవతకు నరబలిని తీసుకు వచ్చామని చెప్పారు. ఇక ఆ కుల పెద్ద ఆ నరున్ని ఒక గదిలో వుంచి బంధించాలని చెప్పాడు. మరుసటి రోజు ఆ రాజుని నరబలి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. నరబలి ఇచ్చేముందు  ఆ నరుడికి ఏమైనా అంగవైకల్యం ఉందో.. లేదో.. పరీక్షించమని సెలవిచ్చారు. అప్పుడు రాజు కు ఒక వేలు తెగిపోయిన విషయం వారికి తెలిసింది. అప్పుడు అంగవైకల్యం ఉన్న వారిని నరబలి ఇవ్వడానికి  అర్హులు కాదని ఆ కుల పెద్ద సెలవిచ్చాడు. ఇక అందుకే ఆ రాజును వదిలేశారు.. ఇక దీంతో రాజు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు..


ఇక అప్పుడు రాజుకు మంత్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి, రాజు బావి దగ్గరకు వెళ్లి మంత్రిని వెలికి తీశాడు. మంత్రి నువ్వు చెప్పిన మాటలు ..ఏమి జరిగినా మన మంచికే అన్నది ఇప్పుడు నా జీవితంలో నాకు మంచే జరిగింది అని చెప్పాడు.. మంత్రి కూడా రాజా నా జీవితంలో కూడా మంచే జరిగింది అని సెలవిచ్చారు. ఇలా మంత్రి ఎందుకు అన్నాడు అంటే, మంత్రికి ఎలాంటి అంగవైకల్యం లేదు. ఒకవేళ రాజుతో సహా మంత్రి కూడా అక్కడకు వెళ్లి ఉండింటే, ఆ కోయ జాతివారు మంత్రిని నరబలి  ఇచ్చేవారు. అని..అందుకే ఏమి జరిగినా మన మంచికే.. అని అంటారు పెద్దలు..

మరింత సమాచారం తెలుసుకోండి: