మన పూర్వీకులు వాడే పద్ధతులకు, మనం వాడుతున్న పద్ధతులకు చాలా తేడా ఉంది. మనం వాడే పద్ధతుల వల్ల రోగాలు వస్తున్నాయి. మన పూర్వీకులు వాడే పద్ధతుల వల్ల రోగాలు పోయాయి.. అందుకు తగ్గ నిదర్శనం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


పూర్వకాలంలో ఇంటికి దూరంగా మరుగుదొడ్లు ఉండేవి. ప్రస్తుతం మన ఇళ్లల్లోనే మరుగుదొడ్లు ఉంటున్నాయి. వీటినుంచి సూక్ష్మక్రిములు నేరుగా మనం తినే ఆహారంలో చేరడం వల్ల అనారోగ్య పాలవుతున్న విషయం తెలిసిందే. చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్లు, చేతులు, ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి రమ్మనే వారు. ప్రతి గడపకు పసుపు కూడా రాయమని చెప్పేవారు. వారానికి ఒకసారి ఇంట్లో వున్న సామానులన్నీ సర్ధి, ఇల్లంతా శుభ్రం చేసే వాళ్ళు. ఇక సున్నంతో గోడలకు రంగు వేయడమే కాకుండా ముగ్గులు కూడా పెట్టేవారు. ఇందుకు కారణం కాల్షియం నుండి వెలువడే ధాతువులు ఇల్లు అంతా వ్యాపించి, కొన్ని వ్యాధి కారక వైరస్ ను  నిరోధిస్తాయి.

స్నానం చేశాక వంట ఉండేవారు. నోట్లో వేలు పెట్టుకోవద్దని, గోర్లు కొరకవద్దని, ఏదైనా తినేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని కూడా చెప్పేవారు. స్నానం చేశాక మడి అని చెప్పి ,స్నానం చేయని మిగతా వారిని అంటకుండా ఉండేవారు. ఇక మనం బయటకు వెళ్లే ముందు ఎవరైనా తుమ్మితే, అపశకునం  అని, కొద్ది క్షణాలు ఆగి వెళ్లమని చెప్పేవారు. ఎందుకంటే ఆ తుమ్మిన వ్యక్తి నోటి నుండి ముక్కు నుండి వెలువడిన తుంపర్లు, కొద్దిసేపు గాలిలో తేలియాడి , మెల్లగా నేల మీదకు చేరుకుంటాయని అలా చెప్పేవారు.

బయటకు వెళ్ళాక, తెలిసిన వాళ్ళు ఎదురు పడితే రెండు చేతులు జోడించి నమస్కారం చేయమని చెప్పే వాళ్ళు. నెలకు ఒకసారైనా మిరియాల చారు ,మెంతుల పులుసు తప్పనిసరిగా తినమని చెప్పేవాళ్ళు. కనీసం ఆరు నెలలకు ఒకసారైనా ఆముదం శరీరానికి పట్టించాలట.. ఎవరి ఇంట్లో అయినా బిడ్డపుట్టిన లేక ఎవరైనా చనిపోయిన 11 రోజులు మైల అని చెప్పి ఇతరులను ఇంట్లోకి రానిచ్చేవారు కాదు.ఇక మన పూర్వీకులు ఇవన్నీ చెప్పడమే కాకుండా పాటించారు కూడా. అందుకే వారికి ఎలాంటి రోగాలు సంభవించలేదు.

చూశారు కదా.. ఇవన్నీ ఆలోచిస్తుంటే ,మన పూర్వీకులు కూడా కరోనా లాంటి పెద్ద వైరస్ తో పోరాడి, ఇటువంటి నియమాలను ఆచారాలతో మేళవించి అనుసరించారు ఏమో అనిపిస్తుంది. కానీ పూర్వికులను చాదస్తవాధులని  ముద్రవేసి వారు చెప్పిన మాటలు వినకుండా ఇప్పుడు తీవ్ర అనర్థాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: