మన జీవితం ఎప్పుడూ ఆనందంగా సుఖసంతోషాలతో సాగాలి అంటే, అందుకు తగ్గట్టుగా కొన్ని కొన్ని అలవాట్లను మానుకోవాలి. లేదంటే అవి మరీ అతిగా మారి వ్యసనంగా తయారయ్యి మిమ్మల్ని దహించి వేస్తాయి. ఇక ఆ మంటల్లో కాలి బూడిద అవ్వకముందే అది మంట అని గుర్తించి దాని నుంచి దూరంగా ఉండటం నేర్చుకోండి. జీవితంలో కొన్ని విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకుంటే గెలుపెప్పుడూ మీ వెంటే ఉంటుంది.


ఇల్లు, తిండి ,సౌకర్యాలు మొదలగు ఫ్రీగా వచ్చే వాటిని చులకనగా చూడవద్దు. ఇక ఎవరిని అంత తొందర గా ఫాలో అవ్వకండి. అందరూ వాళ్ళ వాళ్ళ జీవితాల్లో పొరపాట్లు చేసిన వారే.ఎవరో ఒకరు నచ్చారు అని చెప్పి వారిని ఫాలో అవ్వడం అంత మంచిది కాదు. బ్రాండెడ్ బట్టలు కావాలని వున్న డబ్బును వృధా చేయవద్దు.మీ జీవితాన్ని ఇతరులు కంట్రోల్ చేసే లాగా ఉండకూడదు. మీరు ఏది చేసినా, ఏమి చేయాలనుకున్నా నిర్ణయం మీదే ఉండాలి. మీకు నచ్చిన నటుడు లేక నటి చెప్పిందని, వాళ్ళు చెప్పిన ప్రతీదీ పాటించద్దు. చాలామంది వ్యాపారం కోసం మాత్రమే అందులో నటిస్తారని తెలుసుకోండి

ఇక తొందరపాటులో పెళ్లి చేసుకోవద్దు. మీ తల్లిదండ్రుల కోసమో లేదా మీ గర్ల్ ఫ్రెండ్ పోరు పెడుతుందనో, బాయ్ ఫ్రెండ్ తొందర పెడుతున్నాడనో, సమాజం ఏమనుకుంటుందో అని , ఇలాంటి ఆలోచనలతో పెళ్లి చేసుకోవద్దు. పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ ఎలా ఉండబోతుంది ?ఏ విధంగా తయారవుతుంది? అనే విషయాలు తెలుస్తాయి. ఎదుటి వాళ్ళ ప్రభావానికి గురి కావద్దు.

మద్యం, ధూమపానం వంటి అలవాట్లకు చాలా దూరంగా ఉండాలి. అంతేకాకుండా ఇటీవల కాలంలో చాలామంది అశ్లీల చిత్రాలకు బాగా  బానిసలవుతున్నారు. అలాంటివి అలవాటు అయితే వీటి లేకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది దానివల్ల మీ పనితీరు మీద ప్రభావం పడుతుంది..

ఎవరిని అది తొందరగా దూరం చేసుకోవద్దు.
వీలైనంత వరకు కోపతాపాలను తగ్గించుకొని, అందరితో కలిసి మెలిసి ఉండేలా చూసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: