అనగనగా ఒక ఊరిలో ఒక వర్తకునికి ఒక గుర్రం, ఒక గాడిద ఉండేవి. ప్రతిరోజు ఆ రెండింటి పైన  సరుకులు వేసి మార్కెట్ కు  తోలుకొని పోతుండేవారు ఆ వర్తకుడు. ఒక రోజున ఎక్కువ సరుకులు లేనందున, కొన్ని సరుకులను గాడిద పైన మాత్రమే వేసి మార్కెట్ కు  తోలుకొని వెళ్ళాడు .అలవాటు ప్రకారం గుర్రం కూడా వీళ్ళ పక్కనే  నడుస్తోంది. ఇక ఆ రోజు ఎండ చాలా ఎక్కువగా ఉండడంతో సరుకుల బరువును కూడా మోయలేక గాడిద ఆయాస పడిపోయింది.


చివరికి గాడిద మెల్లగా గుర్రం చెవిలో మిత్రమా ! కొంచెం సేపు ఈ బరువును నీవు మోస్తావా ? ఆయాసం తీరిన తర్వాత మళ్ళీ నేనే మోస్తాను. దయచేసి ఈ సహాయం నువ్వు చెయ్యి అని అడిగింది. ఇక దానికి కోపంగా గుర్రం.." ఎవరి బరువును వాళ్లే మోయాలి. నేనెందుకు మోస్తాను "అని అంది. ఇక ఆ మాటలతో గాడిదకు చాలా బాధ కలిగింది. కానీ అది గుర్రాన్ని ఏమీ అనలేదు. కొంచెం సేపు నడిచి , వడదెబ్బకు తట్టుకోలేక గాడిద మూర్చపోయింది.

ఎలాగైనా సరే, వర్తకుడు సరుకులను  తొందరగా మార్కెట్ కు  చేర్చాలనే తలంపుతో, ఆ సరుకులను తీసి గుర్రం పైన వేసి తీసుకొని వెళ్ళాడు. ఇక కొంచెం దూరం మోయడానికి బదులు, పూర్తి దూరం ఆ సరుకులు అన్నింటిని మోయవలసి వచ్చింది గుర్రానికి.. కాబట్టి ఎవరైనా సరే సహాయం అడిగినప్పుడు కాదనకుండా చేసి తీరాలి.

ఇక గుర్రమే కనక, గాడిద చెప్పినట్టు కొంచెం సేపు ఆ బరువుని మోసి నట్లైతే , అంత బరువును మోసే అవసరం వచ్చి ఉండేది కాదు కదా ! గుర్రం , గాడిద యొక్క బాధను అర్థం చేసుకోలేకపోయింది. చివరకు ఆ సరుకులన్నింటినీ అదే మోయాల్సి వచ్చింది. కేవలం ఇది మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ కూడా మన జీవన శైలిలో ఎవరో ఒకరు మన నుంచి ఏదో ఒక సమయం కోరుతూ ఉంటారు. అలాంటి వారికి చేతనైన సహాయం చేయగలగాలి. అప్పుడే సాటి మనిషిగా మనకు ఒక గుర్తింపు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: