ఒకానొక సమయంలో ఒకసారి ఒక ఏనుగు అడవిలో నడిచిపోతూ అనుకోకుండా ఒక చీమల పుట్ట మీద కాలు వేసింది. ఇక వెంటనే ఆ చీమలన్నీ ఒక్కసారిగా.. ఎవతివే..! నువ్వు.. పెద్ద శరీరం వున్నంత మాత్రాన బుద్ధి ఉండక్కర్లేదు .. మా పుట్టను ఎందుకు ఇలా నాశనం చేసావు అని అరిచాయి. ఇక దానికి ఏనుగు నవ్వుతూ.. ఎవరే ఆ మాట్లాడేది.. నాకు కనిపించడమే లేదు.. కానీ మాటలు మాత్రం వినిపిస్తున్నాయి.
అంత చిన్న ప్రాణులు మీరు. పొగరుబోతు లారా! మీరు నన్ను ఎదిరిస్తారా? అంది. తర్వాత చీమలన్నీ కూడబలుక్కొని " ఎలాగైనా ఆ ఏనుగు పొగరు అణచాలని అనుకున్నాయి. వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా చీమలు ఏనుగు కాళ్ళ పైకి కుట్ట సాగాయి. ఏనుగు చర్మం చాలా మందంగా ఉండటంతో దానికి ఏమి బాధ కలగలేదు. అందులోనే ఒక తెలివైన ఎర్ర చీమ.. ఏనుగు కళ్ళు చాలా సున్నితంగా ఉంటాయి అక్కడ కుడితే కచ్చితంగా దానికి బాధ తెలుస్తుంది. మీరు కళ్ళ వద్దకు వెళ్లండి.. నేను దాని చెవిలో కి వెళ్తాను అని చెప్పుకొచ్చింది.
ఆ వెంటనే చీమలన్నీ ఏనుగు కళ్ళ వద్దకు వెళ్ళి కుట్టసాగాయి.. ఆ బాధతో కళ్ళు మూసుకొని ఏనుగు గుడ్డిదాని లాగా గంతులు వేయడం మొదలుపెట్టింది. ఆ బాధతో ఏనుగు ఏడుస్తూ, అరుస్తూ ఉంది. చెవిలో వున్న చీమ దానిని ఒక్కసారిగా కుట్టి, ఏమి ఇప్పుడు తెలిసిందా ? చిన్న ప్రాణులా తడాక! అయితే ఇప్పుడు చెప్పు "మాశక్తి గొప్పదా నీ శక్తి గొప్పదా" అన్నాయి చీమలు..
అలా చీమలు కుట్టి, ఏనుగుని గుడ్డిదాన్ని చేశాయి. దాంతో దారి కనబడక ఒక చెట్టు కొమ్మను ఢీకొట్టి కిందపడిపోయింది ఏనుగు. ఇక అక్కడికక్కడే స్పృహ తప్పింది.
అల్పులమని మమ్మల్ని యీసడించిన ఆ ఏనుగు గతి ఏమైందో చూడండి.. అని చీమలన్నీ సంతోషంతో గంతులు వేశాయి. కాబట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు ఇక్కడ శక్తి కన్నా బుద్ధి గొప్పది..