కర్ణుడు సాధారణంగా కుంతీదేవి యొక్క ప్రథమ పుత్రుడు అని అంటారు .కానీ కుంతిదేవి నవమాసాలు మోసి కర్ణుడికి జన్మను ఇవ్వలేదు. కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే దుర్వాస మహర్షి ఆమెకు సంతాన సాఫల్య మంత్రాన్ని వరంగా ఇచ్చాడు. అయితే దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన వరం సఫలం అవుతుందో లేదో అని  తెలుసుకోవడానికి కుంతీ దేవి ఒక ప్రయత్నంగా శుచి అయ్యి, సూర్యభగవానున్ని చిత్తశుద్ధితో  సూర్యభగవానుని ప్రార్థిస్తుంది. ఇక ఆయన దయవల్ల కుంతీదేవి కర్ణుడిని ప్రసాదంగా పొందుతుంది.


పూర్వకాలంలో ఒక రాక్షసుడు ఉండేవాడట..ఆ రాక్షసుడు బ్రహ్మదేవున్ని ఘోరంగా తపస్సు చేసి , అభేఛ్యమైనా 1000 కవచాలను వరంగా పొందుతాడు. ఇక అప్పటినుంచి ఆ రాక్షసుడికి సహస్రకవచుడు అని పేరు స్థిరపడిపోయింది. ఇక ఆ రాక్షసుడు ఆ వరం గర్వంతో సర్వలోకాలను నానా హింసలకు గురిచేసి ఆనందిస్తూ ఉండేవాడు. ఇక ఆ రాక్షసుడి బాధలు పడలేక సర్వ జీవకోటి శ్రీమహావిష్ణువుని ప్రార్థిస్తాయి. ఇక అప్పుడు శ్రీమహావిష్ణువు.." మీరేమి భయపడకండి. నర నారాయణుల రూపంలో బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను" అని వారికి ధైర్యం చెప్పి పంపారు శ్రీమహావిష్ణువు.


ఉగ్ర నరసింహ స్వామి హిరణ్యకశిపుని వధించిన తరువాత రెండు భాగాలుగా విడిపోయాడు. ఒకటి సింహ రూపం , మరొకటి నరుడు రూపం. ఇలా వారిరువు నర నారాయణులుగా , ధర్ముని కుమారులుగా జన్మిస్తారు. వారిరువురు పుట్టుకతోనే బలపరాక్రమ వంతులు. ఇక వీరిద్దరూ బదరికావనంలో ఏ ఆటంకం లేకుండా తపస్సు కొనసాగిస్తున్నారు. ఇక ప్రహ్లాదుడు ఒకసారి బదరికావనంను  చూడడానికి వెళ్ళినప్పుడు, అక్కడ నరనారాయణులు తపస్సు చేస్తూ ఉండటం గమనిస్తాడు. వీరి పక్కన ఆయుధాలు ఉండడం చూసి, వీరు తాపసుల కదా..! వీరికి ఆయుధాలతో పని ఏంటి..? వీరు ఏదో కపట తాపసులు అయి ఉంటారు. అని అనుకొని వారికి తపస్సు భంగం కలిగిస్తాడు.


నరనారాయణులను యుద్ధానికి ఆహ్వానించి, ఎన్ని రోజులైనా సరే వారిని జయించలేకపోతాడు ప్రహ్లాదుడు. ఇక ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా.. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై, ప్రహల్లాద వారిరువురూ నా అంశలు. వారిని ఎన్నటికి గెలవలేవు అని చెబుతాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకుని నరనారాయణులను క్షమించమని అడిగి ,అక్కడనుంచి వెళ్ళి పోతాడు. ఇక మళ్లీ నరనారాయణుల తపస్సు కొనసాగుతోంది  అప్పుడు వర నార్వాందుడైన రాక్షసుడు సహస్రకవచుడు అక్కడికి వస్తాడు. ఇక వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. నరనారాయణులు మేము ఇద్దరం కలిసి నీ ఒక్కడి పై యుద్ధం చేయడం ధర్మం కాదు. కాబట్టి మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తుంటే , మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతడికి ఎలాంటి అంతరాయం కలగకూడదు..అని చెప్తారు.

అందుకు నీకు సమ్మతం అయితే యుద్ధానికి మేము సిద్ధమే అని చెబుతారు నరనారాయణులు. ఇక ఆ రాక్షసుడు  ఒప్పుకోవడంతో నరుడు తపస్సు చేస్తుండగా, నారాయణుడు సహస్రకవచుడుతో యుద్ధానికి దిగుతాడు .యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అలా 1000 సంవత్సరాలు కొనసాగిన తరువాత నారాయణుడు సహస్రకవచుడు ఒక కవచాన్ని ఛేదించగలగతాడు. ఇక అప్పటికి అలసిపోయిన నారాయణుడి విశ్రమించడంతో,  ఆ రాక్షసుడితో నరుడు యుద్ధానికి దిగుతాడు.అలా మరో 1000 సంవత్సరాల యుద్ధం జరిగిన తరువాత  సహస్రకవచుడి ఒక కవచాన్ని నరుడు ఛేదించగలగుతాడు. నరనారాయణులు భీకరమైన యుద్ధాలు చేసి 999 కవచాలను తొలగించారు.


ఇక సహస్రకవచుడు తన దగ్గర ఒక కవచం ఉందని మాత్రమే తెలుసుకొని, పరుగుపరుగున భయంతో సూర్యదేవున్ని కాపాడమని వేడుకుంటాడు. అప్పుడు సూర్యభగవానుడు.." కలకాలం నీకు అభయం ఇవ్వలేను.. నరనారాయణుల అనంతరం నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను" అని చెప్తాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండి పోయాడు. ఇక కుంతి మంత్ర బలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు, ఆ సహస్రకవచుడిని చంటి బిడ్డగా మార్చి కుంతిదేవి చేతికి అందించాడు. ఇక అందుకే కర్ణుడు సహస్ర కుండలాలతో జన్మించాడు. ఇక ఆ ఒక్క సహస్ర కవచాన్ని కూడా వధించడానికి నరనారాయణులు కృష్ణార్జునులుగా జన్మించి , చివరికి మహాభారత యుద్ధంలో కర్ణుడిని అంతం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: