మహాభారతంలో ఏకలవ్యుడి పాత్ర కీలకమైనది. గాండీవదారియై కురుక్షేత్ర యుద్ధంలో ,విలువిద్య లో అర్జునుడిని మించిన వాడిగా చరిత్రపుటల్లో తనకంటూ ఒక అధ్యాయాన్ని లిఖించుకున్న ఏకలవ్యుని గురించి నేటితరం వారికి ఎక్కువగా తెలియదనే చెప్పాలి. అసలు ఏకలవ్యుడు ఎవరు..? ద్రోణాచార్యుడు అతన్ని శిష్యుడిగా ఎందుకు తిరస్కరించారు..? అతను అంతటి విలువిద్యను ఎలా సాధించాడు..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..ఏకలవ్యుడి గురించి తెలియాలంటే ఒకసారి మహాభారతాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి.ఏకలవ్యుడు నిషాద కులంలో హిరణ్యుడు - సులేఖ అనే దంపతులకు జన్మించాడు. నిషాద కులస్తులను ఈ కాలంలో ఎరుకలవారిగా లేక బోయవారిగా పిలుస్తున్నారు. వీరు ప్రధానంగా అడవులలో జీవిస్తూ అక్కడే ఆకులు అలములు దుంపలతో పాటు వన్యప్రాణులను వేటాడి జీవనం సాగిస్తారు. వీరి ఆహారం అధికభాగం జంతువుల వేట వల్లనే వస్తుంది. అందువల్ల ఈ కులం వారు విలువిద్యలో మంచి నైపుణ్యం కలిగి ఉంటారు ఈ నిషాద కులానికి రాజు ఏకలవ్యుడి తండ్రి అయిన హిరణ్యుడు. ఏకలవ్యుడు తన తండ్రి వద్దనే విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టాడు. అయితే హిరణ్య ధన్యుడు జరాసంధుడి వద్ద సామంత రాజుగా ఉండేవాడు. దానివల్ల జరాసంధుడి యుద్ధాలలో పాల్గొని ఒక యుద్ధంలో వీరమరణం పొందాడు. తండ్రి మరణించడం వల్ల ఏకలవ్యుడు వారి తెగకు చిన్నవయసులోనే రాజు అయ్యాడు. తండ్రికి ఉన్నంత పూర్తి బుద్ధి కౌశలం, వేటకు వెళ్ళినప్పుడు అటవీ మృగాల నుంచి తనవారిని కాపాడుకునే అంత నేర్పు, విద్య అంత చిన్న వయసు కలిగిన ఏకలవ్యుడిలో లేకపోవడంతో విలువిద్యను నేర్చుకునేందుకు ప్రయత్నాలు చేశాడు. అలా విలువిద్య నేర్పించగల గురువు గురించి వెతుకుతున్న సమయంలో సకల విద్యా పారంగతుడు ,విలువిద్యలో ఎదురులేని పరాక్రమశాలి అయిన ద్రోణాచార్యుల గురించి తెలుసుకుని, ఆయన వద్దకు వెళ్ళి తనకి కూడా సకల శాస్త్ర విద్య నేర్పమని అడిగాడు ఏకలవ్యుడు.అందుకు ద్రోణాచార్యుడి తిరస్కరించాడు. తిరస్కారానికి కారణం ఏమిటి అని అడుగగా నేను కేవలం క్షత్రియులకు, బ్రాహ్మణులకు మాత్రమే విద్యను నేర్పుతాను. నీవు నిషాధ కులానికి కు చెందిన వాడు కాబట్టి నీకు నేను విలు విద్యను నేర్పలేను అని చెప్పడంతో , అక్కడినుండి వెళ్ళిపోయాడు ఏకలవ్యుడు. కానీ ఏకలవ్యుడు మాత్రం ద్రోణుడు తన గురువు అని భావించి, ఒక మట్టి బొమ్మను తయారు చేశాడు.ఆ బొమ్మే తనకు విలువిద్య నేర్పుతుందని భావించి, విలువిద్యను నేర్వడం మొదలుపెట్టాడు. అలా ద్రోణాచార్యుడు దగ్గర లేకపోయినా ఆయన విగ్రహం ముందు,విలువిద్యను నేర్చుకొని అర్జునుడి మించిన విలువిద్య కారుడిగా పేరుప్రఖ్యాతులు పొందాడు.