సాధారణంగా మనలో చాలామంది బయటకు ఎక్కువగా వెళుతుంటారు. అలా బయటకు వివిధ రకాల పనుల మీద వెళుతూ ఉంటారు. ఏదైనా ఆఫీసు పని మీద, ఉద్యోగం వేటలో, ఏదైనా శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మన ఎక్కువగా వీటిని చూసి వెళ్తే , మనకు శుభం జరుగుతుందనే విషయం మనకు తెలిసిందే. ఇక అంతే కాకుండా మనకి ఇష్టమైన దేవుడిని తలుచుకొని ముందుకు సాగిస్తుంటాము. అయితే అలాంటి వాటిలో మనకు తెలియని కొన్ని వాటిని,  బయటికి వెళ్ళేటప్పుడు  చూడడం మంచిదట. అంతేకాదు మనం బయటికి వెళ్ళేటప్పుడు వీటిని చూసినట్లయితే మన పనులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఉంటుంది.ఇక వాటి గురించి తెలుసుకుందాం..


1). ముఖ్యంగా ఏదైనా నిండుగా ఉండే నీళ్ల కుండ, బిందే  ను మొదలగు వాటిని చూసి వెళ్తే మంచిదట.

2). అదేవిధంగా ఆవుపాలను చూస్తే మరీ మంచిదని కొంతమంది పండితులు తెలిపారు. ఆ పని సజావుగా సాగుతుందట.

3). ఇక ఏదైనా శుభకార్యాలకు, పెళ్లి ప్రయాణాలు వంటివి చేసేటప్పుడు.. పాలు తాగేటటువంటి దూడను చూడడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

4). ఇక అనుకొని కారణంచేత ఎవరికైనా తుమ్ము వస్తే  అది కూడా శుభానికి చిహ్నం అని చెప్పవచ్చు. ఇక అంతే కాకుండా ఎక్కువ తుమ్ములు వచ్చినట్లయితే ఆ పనిలో ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తి అవుతుందని అర్థం.

5). ఇక అదే విధంగా మనం గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, భగవంతుడిని మొక్కుతున్నప్పుడు గంటల శబ్దం వినిపించిన కూడా ఆ పని సక్సెస్ అవుతుంది.

6). ఇక మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి బయటకు వెళుతున్నప్పుడు పూల చెట్లను, పూలహారాలను చూసినట్లయితే శుభం కలుగుతుంది.

7). ఇక మరొక విషయం ఏమిటంటే తమలపాకులను, చేపలను, ఏనుగును ఇల్లు నుండి బయలుదేరేటప్పుడు బయట చూసినట్లయితే, ఆ పనికి ఎటువంటి ఆటంకం కలగకుండా పూర్తవుతుంది.

చూశారు కదా..! ఇకనైనా మీరు బయటకు వెళ్ళేటప్పుడు వీటిని చూసి, మీ పనిని మరింత సులభం చేసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: