ఈ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి. లేకపోతే శని మహాత్ముడు కోపోద్రిక్తుడై ,మనపై తన ప్రభావాన్ని చూపే ఆస్కారం ఉంది.. కాబట్టి నవగ్రహాల చుట్టూ మనం ఏవిధంగా ప్రదక్షిణ చేయాలి.. ఎన్ని సార్లు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం..
నాటి కాలంతో పోల్చుకుంటే నేటి కాలంలో ఎక్కువ మంది నవగ్రహాలను దర్శిస్తూ, గ్రహ దోషాలకు పరిహారం చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన పుట్టుకతో వచ్చిన ఏవైనా గ్రహదోషాలు ఉంటే, పోతాయన్న నమ్మకంతో నవగ్రహాలకు పూజలు చేస్తూ, పరిహారం పొందుతూ ఉంటారు. ఈ నవగ్రహాలకు పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. మనలో కొంతమంది నవగ్రహాలను తాకుతూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. నవగ్రహాలను, చేతితో తాకుతూ ప్రదక్షిణలు చేయరాదు అని పురోహితులు చెబుతున్నారు.
ఇక ఎలా ప్రదక్షిణలు చేయాలి అనే విషయానికి వస్తే, నవగ్రహాల దగ్గరకు వెళ్లేటప్పుడు సూర్యుడి భగవానుని చూస్తూ లోపలికి ప్రవేశించాలి. చంద్రుడి నుంచి కుడివైపుగా నడుస్తూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాల్సి ఉంటుంది.అంతేకాదు ఈ నవ గ్రహాల పేర్లు మనసులో తలుచుకుంటూ మండపం నుంచి బయటకి రావాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నవగ్రహాలకు మన వీపును చూపకుండా బయటకు రావాల్సి ఉంటుంది. అంటే మనం వెనక్కి నడుస్తూ మండపం నుంచి బయటకు రావాలి. ఇలాంటి నియమాలు పాటిస్తే తప్పకుండా నవగ్రహాల ప్రతికూల ప్రభావం ఉంటుంది.