ఇటీవల కాలంలో ఎక్కడచూసినా కల్తీ జరుగుతోంది అనే విషయం.. మనం ప్రతి రోజూ చూస్తూనే ఉన్నాం అలాగే వింటూనే ఉన్నాం.. కానీ ఈ కల్తీ ల కారణంగా అమాయకపు ఆడపిల్లల పైన అధిక భారం పడుతోంది. ముఖ్యంగా ఆడపిల్లలలో పీసీఓడీ అనే సమస్య తలెత్తి, వారు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నారు. ఇక అంతే కాదు హార్మోన్ ఇంజెక్షన్లు అలాగే యాంటీబాడీ ఇంజెక్షన్ల వల్ల పీసీఓడీ సమస్య లు అమ్మాయిలలో ఎక్కువగా తలెత్తుతున్నాయి. అంతేకాదు ప్రతి 28 రోజులకు రావలసిన రుతుక్రమం సరిగ్గా జరగక ఆడపిల్లలలో గర్భానికి సంబంధించిన పలు సమస్యలు కూడా తలెత్తుతున్నాయి.

పూర్వ కాలంలో అమ్మాయిలు 12 లేదా 13 సంవత్సరాలు పూర్తిగా నిండిన తర్వాతనే మెచ్యూరిటీ దశకు చేరుకునేవారు. కానీ ఈ కల్తీ ఆహారం వల్ల ఎనిమిది లేదా తొమ్మిది సంవత్సరాలు కూడా పూర్తిగా నిండకముందే మెచ్యూరిటీ అవుతున్నారు. ఈ కల్తీ అనేది పాలల్లో ఎక్కువగా జరుగుతోంది. ఇక అంతే కాదు ఈ కల్తీ పాలు తాగడం వల్ల మగవారిలో కూడా బ్రెస్ట్ సైజు పెరిగిపోతూ, వారు బ్రెస్ట్ ప్లాస్టిక్ సర్జరీ ల కోసం ఎక్కువగా వెళ్తున్నారు.. ఇటీవల కాలంలో ముఖ్యంగా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, మగవారే ఎక్కువగా ప్లాస్టిక్ సర్జరీల కోసం వైద్యులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ కల్తీ పాలు తాగడం వల్ల మగవారిలో కూడా ఆడవాళ్ల లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. సాధారణంగా ఆవు లేదా గేదె నుంచి తీసుకున్న పాలల్లో యాంటీబాడీస్ ఎక్కువగానే ఉంటాయి. అలాంటప్పుడు మళ్ళీ మనం కి యాంటీ బాడీస్ కి సంబంధించిన ఇంజక్షన్ చేసుకోవడం వల్ల, శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇటీవల చాలా మంది చిన్న చిన్న సీజనల్ జబ్బులు అయినటువంటి జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటికి కూడా ఈ ఇంజక్షన్లు తీసుకుంటున్నారు. సహజంగా ఉన్న యాంటీబాడీస్ తో పాటు  మనం ప్రత్యేకంగా ఇంజక్షన్  రూపంలో ఈ యాంటీ బాడీస్ తీసుకోవడం వల్ల శరీరం అనారోగ్యం పాలవుతుంది.

అందుకే వైద్యులు సూచిస్తున్న సలహాల మేరకు, ప్రతి ఒక్కరు సహజసిద్ధంగా ఆవు  లేదా గేదె నుంచి తీసుకోబడిన పాలను మాత్రమే సేవించాలని, మార్కెట్లో దొరికే పాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ఈ కల్తీ పాల వల్ల ఆడ పిల్లల్లో మరింత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.


మరింత సమాచారం తెలుసుకోండి: