
ఒక ఏడాది ఆ వూరి రామాలయంలో ఊరి పెద్దలు అందరూ సమావేశమై.. శ్రీరామనవమికి ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు..అయితే రామేశం చేసిన సూచనలను అన్నింటిని భీమేశం అనే పెద్దమనిషి కాదంటున్నాడు. ఇక దాంతో రామేశం సూచనలు ఇవ్వడం మానేశారు. అక్కడే ఉన్న కామేశం బాధ నటిస్తూ రామేశం సూచనలు ఇవ్వడం మానేశావేమి ?"అన్నాడు. అవును కానీ చోట అధికుల మనరాదు అన్నాడు రామేశం. నీ మాట వినడం లేదని కోపం వచ్చిందా..? అన్నాడు కామేశం..
రామేశం ఆయనను రెచ్చగొట్టాలని అలా మాట్లాడారు. పేదవారి కోపం పెదవికి చేటు అన్నాడు అప్పుడు రామేశం..అర్థమయ్యింది.. నీకు పేదరికం లేదని సీతారాముల కల్యాణానికి రావా ఏంటి అన్నాడు కామేశం.. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే కదా అన్నాడు రామేశం..అందరూ పెద్దలే అంటున్నావు మరి అందరూ అందలం ఎక్కే వాళ్లయితే మోసే వాళ్లెవరట అంటూ కామేశం తాను ఓ సామెత ప్రయోగించి మెప్పు కోసం అందరి వంక చూశాడు.
కామేశం చటుక్కున ఆ ఎవడో నీలాంటి వాడు అన్నాడు.. అక్కడున్న వారంతా ఘోల్లుమన్నారు కామేశం ముఖం వెలవెలబోయింది. ఏదైనా మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడితే ప్రతి ఒక్కరికీ బాగుంటుంది అని, ఇతరుల మెప్పు పొందడం కోసం ఎదుటివారి మనసును నొప్పించడం ఎంతవరకు సమంజసమో ఎవరైనా చెప్పగలరా అంటూ ప్రశ్నించాడు రామేశం.. అయితే రామేశం మాటలను గ్రహించిన కామేశం తన తప్పును తెలుసుకొని అప్పటినుంచి ఇతరులను నొప్పించడం మానివేశాడు. ఇక ఆ తర్వాత ఊరి పెద్దలు అందరూ కలిసి ఆ వూరిలో సీతారాముల కల్యాణాన్ని చక్కగా నిర్వహించారు.