
మిత్రులారా... మిమ్మల్నే.. నాతో స్నేహం చేస్తారా! కొత్త కొత్త పాటలు నేర్పిస్తా.. అంది నక్క ..కానీ నక్క మాటలు వినిపించుకోలేదా కోళ్లు. మరో రోజు... మీకో విషయం తెలుసా ..మీ యజమాని తో నిన్ననే మాట్లాడా ఆయన ఇంటి దగ్గర లేనప్పుడు మిమ్మల్ని భద్రంగా చూసుకోమని నాకు చెప్పాడు. అంటూ కొత్త ఎత్తుగడ వేసింది నక్క..
పో.. పో... నీతో స్నేహం చేయ్యం ఒక్కటిగా అన్నాయి కోళ్ళని.రోజు ఇలానే కోళ్లను వేధించేది.. ఓ రోజు రాత్రి కోళ్లని సమావేశమయ్యాయి. ఈ నక్క ఎప్పుడు ప్రాణాలు తీసేస్తుందోనన్న భయంతో బతకాల్సి వస్తోంది. దీనికి ఒక ఉపాయం ఆలోచించాలి అని ఆలోచనలో పడ్డాయి.
దాని సంగతి నాకు వదిలేయండి ఏదో ఆలోచన తట్టినట్టు. అంది ఓ పుంజు.
ఆ మరునాడు యధావిధిగా నక్క వచ్చింది. మిత్రులారా... ఇన్నాళ్ళ నుంచి మీతో మాట్లాడుతున్నాను ఇంకా నాపై నమ్మకం కుదరలేదా? దీనంగా అడిగింది నక్క..నక్క బావ... నీతో స్నేహానికి నేను సిద్ధం చెప్పింది పుంజు..
హమ్మయ్య.. ఇన్నాళ్ళకి ఓ పుంజు నా బుట్టలో పడింది... లోలోపల సంతోషించింది నక్క.మనం బయటకు వెళ్లి ఆడుకుందామా... అని నక్క అడగగానే కంచె దాటి వచ్చేసింది కోడిపుంజునేనో చోటికి తీసుకువెళతాను అక్కడ ఆడుకుందాం సరేనా అని పుంజు అనేసరికి వెనకనే నడవసాగింది నక్క..
నేరుగా యజమాని ఉండే చోటుకు పరుగుతీసింది కోడిపుంజు.. యజమాని కనిపించగానే కొక్కొరొకో.... అంటూ గట్టిగా అరిచింది..అరుపు వినిపించేసరికి తిరిగి చూశాడు.. యజమానికి నక్క కనిపించింది ఓ కర్ర తీసుకుని వెంబడించి దాన్ని చితకబాదాడు. ఆ రోజు నుంచి కోళ్లకు నక్క బెడద తప్పింది. ఉపాయంతో అపాయాన్ని గట్టెక్కించిన పుంజును మిగతా కోళ్ళని ఎంతో మెచ్చుకున్నాయి