ఒక అడవిలో జింక ,కాకి ఎలుక ,తాబేలు ఇలా ఈ నాలుగు ఎంతో సంతోషంగా ఉండేవి. ఈ నాలుగు ప్రాణ స్నేహితులు రోజు సాయంత్రం తాబేలు ఉండే కొలను ఒడ్డున అవి కలుసుకుని కబుర్లు చెప్పుకొనేవి. ఓ రోజు సాయంత్రం కొలను ఒడ్డున స్నేహితుల కోసం ఎదురుచూస్తున్నా తాబేలు అటుగా వెళ్తున్న ఓ వేటగాడి కంట పడింది. వెంటనే అతడు దాన్ని పట్టుకొని సంచిలో వేసుకొని ముందుకు కదిలాడు అప్పుడే కొలను వైపు వస్తున్న కాకి ఇది గమనించింది. ఈ విషయాన్ని జింక.. ఎలుకకు చెప్పింది.


తమ స్నేహితున్ని ఎలా కాపాడుకోవాలా అని మూడు ఎంతో తీవ్రంగా ఆలోచించాయి. ఇంతలో ఎలుకకు చక్కని ఉపాయం తట్టింది. దాన్ని కాకి , జింకలకు చెప్పింది. జింక వేటగాడి ముందు నుంచి వేగంగా పరిగెడుతూ వెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక వేటగాడు వెళ్లేదారిలో జింక  చనిపోయినట్లు పడుకుంది. కాకి దాని మీద వాలి కళ్ళు పొడుచుకొని తింటున్నట్లు నటించింది. అది చూసి... ఈరోజు జింక మాంసం దొరికిందని వేటగాడు సంబరపడిపోయాడు.

తాబేలు ఉన్న సంచిని భుజం మీది నుంచి కింద పెట్టి, జింకను ఈడ్చుకుపోవడానికి నార కోసం వెతకసాగాడు. ఇదే సరైన సమయమని భావించిన ఎలుక, తాబేలు ఉన్న సంచిని కొరికేసింది. దాంతో తాబేలు బయటపడి దగ్గర్లోని పొదల్లోకి వెళ్ళిపోయింది. జింక మీద కూర్చుని ఇదంతా గమనించిన కాకి వెంటనే కావ్ కావ్ మంటూ ఎగిరిపోయింది. తమ ఉపాయం ఫలించిదన్ని తాబేలు తప్పించుకుందన్న విషయం అర్థం చేసుకున్న జింక వెంటనే లేచి పారిపోయింది. చనిపోయిందనుకున్న జింక లేచి పరుగుతీసేసరికి అందులో తాబేలు లేదు. దొరికినదానితో తృప్తి పడక అత్యాశకు పోయానే అని వేటగాడు పశ్చాత్తాప పడ్డాడు..ఎలాగైతేనేమి తమ మిత్రుల్ని కాపాడుకోగలిగామని కాకి ,జింక, ఎలుక ఎంతో సంతోషించాయి. చూశారా.. జంతువులే అయినా చక్కని ఉపాయం తో తమ స్నేహితుల్ని ఎలా కాపాడుకున్నాయో..

మరింత సమాచారం తెలుసుకోండి: