కానీ కిరీటి లంచగొండి అనే విషయం మహారాజుకు e మాత్రం తెలియదు.. మంత్రి లంచగొండితనాన్ని ఎలాగైనా రాజు దృష్టికి తీసుకెళ్లాలని ఆ వూరి ప్రజలు అనుకునేవారు.. కానీ మంత్రి గారి మాటే వేదవాక్కు అని నమ్మే రాజు గారి ముందు ఈ విషయం చెప్పలేకపోయారు. ఓసారి ప్రజలంతా ఓ చోట సమావేశమయ్యారు. మంత్రి ఆగడాల గురించి దేవసింహుడుకి ఎవరు వెళ్లి చెప్పాలా అని ఆలోచించారు.
ఆ విషయం నాకు వదిలేయండి నేను చూసుకుంటాను. అంటూ శేఖరుడనే అనే వ్యక్తి ముందుకొచ్చాడు. శేఖరుడు తెలివైనవాడు కావడంతో ప్రజలంతా అయితే నువ్వే వెళ్ళు అని పంపించారు. జాలరి వేషం వేసుకొని ఒక పెద్ద చేపను తీసుకొని కోటలోకి వెళ్ళాడు శేఖరుడు
ఈ చేపను మహారాజుకి ఇవ్వడానికి వెళ్తున్నాను. ఆయన దర్శనం కల్పించండి అని మంత్రిని కోరాడు శేఖరుడు..అలాగే తప్పకుండా కానీ షరతు... ఆయన నీకిచ్చే బహుమానంలో సగం నాకు ఇవ్వాలి అని మంత్రి అన్నాడు.సరే అంటూ రాజమందిరంలోకి వెళ్ళాడు శేఖరుడు..
మహారాజా! నా పేరు శేఖరుడు ఈరోజు సముద్రంలో వేటకెళితే ఈ పెద్ద చేప దొరికింది. దీనిని మీకు ఇచ్చి పోదామని ఇలా వచ్చాను అన్నాడు.నీ రాజభక్తికి మెచ్చాను. నీకేం బహుమతి కావాలో కోరుకో అని రాజు అడిగారు. ఓ నాలుగు కొరడాదెబ్బలు శేఖరుడు అడగగానే రాజు ఆశ్చర్యపోయాడు. రాజు వద్దని చెప్పినా వినకుండా కొరడా దెబ్బలే కావాలని పట్టుపట్టాడు. చివరికి రాజు ఒప్పుకున్నాడు. బటులను పిలిపించి శేఖరుడిని కొరడాతో కొట్టమన్నాడు.
బటుడు కొరడా ఎత్తుతుండగా ఆగండి... వీటిలో సగం మీ మంత్రిగారికి ఇచ్చేసి మిగతావి నాకివ్వండి అన్నాడు శేఖరుడు..ఏమిటి మా మంత్రిగారికా..ఆశ్చర్యంగా అడిగాడు మహారాజు. అవును మహారాజా... మీకు తెలియదా! మీరిచ్చే బహుమానాలో సగ భాగం మంత్రి గారికి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ కదా! అన్నాడు వెంటనే రాజు కిరీటిని పిలిపించి ఇది నిజమేనా.. అని నిలదీశాడు. తప్పించుకునే మార్గం లేక ఒప్పుకున్నాడా మంత్రి.. తన తెలివితేటలతో మంత్రి లంచగొండితనాన్ని బయటపెట్టిన శేఖరుడి కి సత్కరించి బోలెడు బహుమతులు ఇచ్చాడు దేవాసింహుడు.