దుంపలు ఉన్నాయి. వాటిని చూస్తే ఎవరికైనా తినేయాలనిపిస్తుంది. కానీ ఆ అడవిలోని జంతువులేవి ఆ చెరువు దగ్గరికి వెళ్ళే సాహసం చేసేవికావు..కారణం ఆ చెరువులో కొన్ని వందల ముసళ్ళు ఉండేవి.
ఓ రోజు ఓ కుందేలు ఆ చెరువులో నీళ్ళు తాగడానికి వచ్చింది. దూరంగా ఉన్న దీవి వైపు చూసింది. ఎలాగైనా సరే సరస్సు మధ్యలో ఉన్న దుంపలను తినేయాలనుకుంది. కానీ ముసళ్ళను తప్పించుకోవడం ఎలా?
బాగా ఆలోచించగా ఒక ఉపాయం తోచింది. మరునాడు ఉదయాన్నే సరస్సు దగ్గరకు వచ్చింది. కుందేలు మొసళ్లను బయటకి రమ్మంటూ కేక వేసింది. నీటిలోని మొసళ్లన్ని ఒక్కసారిగా తలలెత్తి చూశాయి. మమ్మల్ని పిలిచే ధైర్యం ఎవరికుందబ్బా అనుకుంటూ ఆశ్చర్యంగా ఒడ్డుకు వచ్చాయి. అప్పుడు కుందేలు ఒక శుభవార్త చెబుతా అంటూ తన తెలివిని ప్రదర్శించడం మొదలు పెట్టింది కుందేలు.. నీకేం భయంలేదు... చెప్పు అంది ఓ పెద్ద ముసలి
ఈ అడవిని పాలిస్తున్న రాజుగారు జంతువులన్నింటికీ విందులు ఏర్పాటు చేసి బహుమతులు ఇద్దామనుకుంటున్నారు. అడవిలో ఎన్ని జంతువులు ఉన్నాయో లెక్క పెట్టిస్తున్నారు. మిమ్మల్ని లెక్క పెట్టే పని నాకు పురమాయించారు. మీరు నన్ను చంపకుండా ఉంటే లెక్కపెట్టి రాజుగారికి విన్నవిస్తాను. అంది కుందేలు
ముసళ్లన్ని తమలో తాము కాసేపు మాట్లాడుకున్నాయి. సరే.. కానీ మమ్మల్ని నువ్వు ఎలా లెక్కపెట్టగలవు? అనుమానంగా అడిగింది ముసలి . మీరందరూ ఒకరి పక్కన ఒకరు వరుసగా నిలబడండి. మీ వీపులపై నుంచి దూకుతూ లెక్కపెడతా అని కుందేలు చెప్పింది. ముసళ్లనీ వరుసగా నీటిలో నిలబడ్డాయి.
ఈ చివరి నుంచి సరస్సు మధ్యలోని ద్వీపం వరకూ ఉందా వరుస చకచకా వాటి మీద నుంచి దూకి ఆ ద్వీపానికి చేరుకుంది. కుందేలు రోజంతా పళ్ళు దుంపలు తినేసి హాయిగా కాలక్షేపం చేసి సాయంత్రానికి ద్వీపం ఒడ్డుకు వచ్చింది.
ఉదయం వెళ్ళిన కుందేలు ఇంకా రాలే దేంటని ముసళ్లు ఎదురుచూస్తూ ఉన్నాయి. ఇప్పటిదాకా ఏం చేస్తూ ఉండిపోయావు. కుందేలు రాకను గమనించిన ఓ ముసలి అడిగింది. మీరు ఎందరో లెక్క తేలక అవస్థ పడుతున్నాను. మరోసారి వరుసగా నిల్చుంటే ఈసారి సరిగ్గా లెక్క పెడతానంది మళ్లీవరుసగా నిలబడ్డాయా ముసళ్లు వాటిపై నుంచి చెంగు చెంగున దూకుతూ దివిలోంచి బయటకు పడింది కుందేలు.