ఒకానొక సమయంలో అవంతి రాజ్యాన్ని రణ వర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అయితే ఆయన మంచివాడే కానీ మహా కోపిష్టి.. ఈయనకున్న అలవాటు ఏమిటంటే ఎవరైనా సరే కారణం లేకుండా శిక్షించి ఆ తర్వాత అయ్యో ఆ కారణంగా వారు తిట్టాను అంటూ పశ్చాత్తాప పడేవాడు. రాజు కోపానికి ఎంతోమంది అమాయక ప్రజలు గురయ్యేవారు. రణ వర్మ ప్రతి నెల మొదటి రోజు రాత్రి సమయంలో మారు వేషం ధరించి ఆయన దేశాటన వెళ్ళేవాడు.

రణ వర్మ ఎప్పటిలాగే ఓ నెల మొదటి రోజున మారువేషంలో దేశాటనకు బయలుదేరాడు. అలా రణ వర్మ దేశాటనకు వెళ్లినప్పుడు ఈయనకు తిమ్మన్న అనే ఒక యువకుడు ఎదురయ్యాడు. అయితే తిమ్మన్న ను చూసి.. వెంటనే ఆపి మీ రాజు గారి పాలన ఎలా ఉంది అని అడిగాడు. రాజు గారి ప్రశ్నకు తిమ్మన్న మాట్లాడుతూ ఏం చెప్పను రాజు ఎంత మంచి వాడు అయినా సరే తన కోపం కారణంగా ఎంతోమంది ప్రజలు రకరకాల కష్టాలను అనుభవిస్తున్నారు అంటూ తీవ్రంగా బాధ పడతాడు.

రాజుకి తిమ్మన్న మాటతో కోపం పూర్తిగా వచ్చి.. మారువేషంలో ఉన్న విషయం కూడా  రణ వర్మ పూర్తిగా మరచిపోయి..నీ ఎదుటే వున్నా కూడా నా గురించి అంత మాట అంటావా.. నీలాంటి వాళ్ళని గుర్తించాలనే  నేను ప్రతి నెల మొదటి రోజు ఇలా మారువేషంలో దేశాటన చేస్తున్నాను.. అంటూ తిమ్మన్న గొంతు పట్టుకున్నాడు. తిమ్మన్న పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ ఆ పరిస్థితుల్లో అతను బుర్ర పాదరసంలా పని చేసి గట్టిగా నవ్వడం ప్రారంభించాడు.

 ఎందుకలా నవ్వుతున్నావు  అని అడిగాడు రాజు..అప్పుడు మహారాజా మీకు ప్రతి నెల మొదటి రోజు దేశాటన  చేసే అలవాటు వున్నట్టే నాకు ఆ రోజంతా అబద్ధాలు ఆడే అలవాటు ఉంది. మీ గురించి  అలా చెప్పాను నిజం చెప్పాలంటే మీ కన్నా గొప్పగా పాలించే రాజు ఎవరు లేరు అన్నాడు.. రాజుకి అప్పటికి కోపం తగ్గిపోవడమే కాదు సమయస్ఫూర్తి కూడా నచ్చింది. పశ్చాత్తాపంతో రాజు ..నువ్వు మొదట చెప్పింది నిజమే తమ్మ అన్నాడు.. ఆ తర్వాత రోజు నుంచి తిమ్మను అ రాజు సలహాదారుడిగా చేర్చుకొని , తన తెలివైన సలహాలతో కోపాన్ని తగ్గించుకొని ఆయన పై వున్న కోపిష్టి ముద్రను కూడా  పోగొట్టుకున్నాడు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: