రామనాధునిపురంలో నివసించే యాదమ్మ గయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు అయితే కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమైనా తినే స్తుందో అని యాదమ్మకు విపరీతమైన అనుమానం అందుకే.. మాటిమాటికీ వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తూ ఉండేది.
ఒకరోజు కోడలు పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోసెలు వేసుకుని ఎర్రకారంతో నంచుకుని తింటుంటే భలే ఉంటుంది. తెలుసా! అని పక్కింటావిడ కోడలితో అన్నది. అప్పటినుంచే లలితకు తను కూడా పుల్లని దోసెలు వేసుకొని..అందులో ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒక రోజు ఎర్రకారం తయారు చేసుకొని దోసెల వేసుకోవడానికి పిండి రుబ్బి పెట్టుకున్నది. తీరా దోసే పోసుకోపోయేటప్పటికి పెనం మీద "సుయీ" మని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ వెంటనే గబగబా వంటింట్లోకి వచ్చి అయ్యో! అయ్యో! నాకు తెలియకుండా దోసెలు వేసుకుని తింటున్నావటే! అంటూ బండ బూతులు తిట్టడం మొదలు పెట్టింది...
పైగా గబగబా ఆ దోసెలులన్ని తానే వేసుకొని తినేసింది.
కోడలు లలితకు బాగా ఏడుపు వచ్చేసింది అయినా సరే పుల్లని దోసెలు తినాలన్నా ఆశ మాత్రం ఆమె చంపుకోలేకపోయింది. నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఎర్ర కారం చేసి పెట్టుకుని దోసెల పిండి రుబ్బి పెట్టుకుంది. లలిత పెనం మీదనుంచి "సూయి"అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది.
అబ్బే దోసెలు కాదు అత్త..! పెనం వేడేక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది కోడలు.. సూరమ్మ సరే సరే! అంటూ వెళ్ళిపోయింది. మూడో సారి అలాగే చేయడంతోదీనికి పెనం కాళింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియటం లేదు. అదే తనయితే చూపులతోనే కనిపెట్టేస్తుంది. అనుకుంది సూరమ్మ మళ్లీ "సుయీ" మనీ శబ్దం వచ్చినా సూరమ్మ మాత్రం రాలేదు. దాంతో లలిత హాయిగా దోసెలు వేసుకుని తినేసింది ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోసెలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత