స్టార్ డైరక్టర్.. స్టార్ హీరో వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చే క్రేజీ మూవీ.. ఆ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు అయితే ఆ కాంబినేషన్  సెట్స్ మీద ఉన్నప్పుడే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. నిర్మాత తాలూఖా బడ్జెట్ నియమాలను పాటిస్తూ.. హీరో ఇమేజ్ కు తగినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా డైరక్టర్ మీద చాలా పెద్ద బాధ్యత ఉంటుంది. అయితే వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ వచ్చే డైరక్టర్ తో హీరోలకు మధ్య కొన్నిసార్లు క్రియేటివ్ డిఫరెన్సులు వస్తాయి.

 

తను చెప్పిన కథనే ఫాలో అవ్వాలన్న డైరక్టర్ మాటని వినని హీరో.. డైరక్టర్ చెప్పిన కథను ఇష్టం వచ్చినట్టుగా మార్చమని చెప్పే హీరో. ఇలా కొన్ని విషయాల్లో తేడాలు వస్తే అంచనాలు పెట్టుకున్న కాంబినేషన్ కాస్త క్రియేటివ్ డిఫరెన్సుల వల్ల క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈమధ్య ఓ క్రేజీ హీరో సడెన్ గా యూత్ లో సూపర్ ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరో కూడా తను చేసే ప్రతి సినిమాలో వేలు పెట్టుడు ఎక్కువైందని అంటున్నారు. ఇది ఆ హీరో చేస్తున్న ప్రతి సినిమా టైంలో వచ్చే కామన్ రూమర్ అయ్యింది.

 

అయితే ఒక సినిమా హీరో ఫేట్ మార్చేస్తుంది.. అందుకే తన కెరియర్ చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే ఆ హీరో డైరక్టర్ కు సలహాలు ఇస్తున్నాడట. డైరక్టర్స్ కూడా కొత్త వాళ్లు ఒక సినిమా అనుభవం ఉన్న వారే కావడం వల్ల ఈ హీరో మాట వినక తప్పట్లేదు. మరి హీరో గారి అత్యుత్సాహం సినిమాకు ప్లస్ అవుతున్నా అతనితో పనిచేస్తున్న డైరక్టర్స్ మాత్రం ఆయన లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడుతున్నారట. మరి ఈ విషయంలో సదరు హీరో మారితే బెటర్ అని అంటున్నారు. అయితే నిర్మాతల సపోర్ట్ కూడా హీరోకే ఉండటం వల్ల డైరక్టర్స్ ఏమి మాట్లాడలేని పరిస్థితి అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: