టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ కొన్నాళ్ల క్రితం తన భార్యని కోల్పోయారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఆయన కూతురికి పెళ్లి చేసి ఒంటరిగా ఉంటున్నారు. అయితే అతను రెండో పెళ్లి చేసుకుంటాడని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్ లో ఏ నిర్మాత ఉండనంత యాక్టివ్ గా ఉండే ఆయన సెకండ్ మ్యారేజ్ విషయం మీడియా చేస్తున్న హడావిడి చూసి ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడట. 

 

స్టార్ హీరోల ఎఫైర్ల గురించి రాసే మీడియా వాళ్లు సినిమాకు రిలేటెడ్ అయిన ఎవరిని వదిలిపెట్టరు. అలానే ఆ నిర్మాత సెకండ్ మ్యారేజ్ గురించి వార్తలు రాస్తూ వచ్చారు. ఈ వార్తలపై ఆయన కూడా రెస్పాండ్ అవలేదు. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఒక ఆంగ్ల పత్రిక ఆ నిర్మాత సీక్రెట్ గా రెండో పెళ్లి చేసుకున్నాడని కన్ఫామ్ చేసింది. ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కాని కేవలం కొద్దిమంది సమక్షంలో ఆ నిర్మాత సెకండ్ మ్యారేజ్ జరిగిందని అంటున్నారు. 

 

మరి నిజంగానే ఆ నిర్మాతకు రెండో పెళ్లి జరిగిందా.. అటు ఇటుగా 50 ఏళ్ళు ఉన్న ఆ నిర్మాతకు రెండో భార్యగా వచ్చింది ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చిన ఆ నిర్మాతని తన సెకండ్ మ్యారేజ్ విషయం అడిగితే మాత్రం అదంతా రూమర్ అని కొట్టిపడేశాడు. ప్రస్తుతం సినీ నిర్మాణంలో బిజీగా ఉన్న ఆ నిర్మాత రెండో పెళ్లిపై వచ్చిన వార్తలన్ని రూమర్సేనా లేక అందులో నిజం ఉందా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజలు వెయిట్ చేయాల్సిందే. ఆ నిర్మాత తన మీద వస్తున్న వార్తలని పట్టించుకోకుండా సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ఆంగ్ల పత్రిక చెప్పినట్టుగా మ్యారేజ్ అయితే మాత్రం అందరికి షాక్ అన్నట్టే. 

మరింత సమాచారం తెలుసుకోండి: