సినిమా తారల మధ్య గొడవలు అసలు బయటపడవు. అదేంటి అసలు వారి మధ్య ఎందుకు గొడవలు ఉంటాయి. ఇప్పుడు అంతా ఒకరిని ఒకరు ఎంకరేజ్ చేసుకుంటున్నారు కదా మరి ఎందుకు అలా అనడం అని డౌట్ పడొచ్చు. సినిమా వాళ్ళ మధ్య గొడవలు అవుతుంటాయి.. కాని అవి ఆడియెన్స్ దాకా రాకుండా జాగ్రత్త పడతారు. యువ హీరోలు ఏమైనా గొడవలు పడితే స్టార్స్.. స్టార్స్ మధ్య తేడా వస్తే వాళ్లకు కావాల్సిన వారు అలా ఎలాగోలా వారి మధ్య గొడవ బయట పడకముందే సెట్ రైట్ అవుతారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మీద డైరెక్ట్ గా అసంతృప్తి వెల్లగక్కి హాట్ న్యూస్ గా మారారు కలక్షన్ కింగ్ మోహన్ బాబు. అప్పట్లో వీరిద్ద్దరి మధ్య ఈ కోల్డ్ వార్ ఇంట్రెస్టింగ్ న్యూస్ గా మారింది. చిరుని డైరెక్ట్ గా.. ఇన్ డైరెక్ట్ గా ఎటాక్ చేసే మోహన్ బాబు ఈమధ్య పూర్తిగా మారిపోయారు. అప్పుడు అంత హంగామా చేసిన మోహన్ బాబు, చిరులు ఈమధ్య చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఇక వీళ్ళ మధ్య ఇంతకుముందు జరిగిన గొడవలు.. చిన్న చిన్న మనస్పర్ధలు అన్ని చెరిపేశారు. ఇక ఇప్పుడు ఇదే పాజిటివ్ ఎట్మాస్మియర్ వారి వారసులు కూడా కొనసాగించాలని భావించారు. అందుకే మూడేళ్ళ గ్యాప్ తర్వాత రాకింగ్ స్టార్ మంచు మనోజ్ నటిస్తున్న అహం బ్రహ్మస్మి సినిమా ముహూర్తానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చి చిత్రయూనిట్ ను విష్ చేశారు.
చరణ్ రాకతో అక్కడ అంటా పండుగ వాతావరణంగా మారింది. ఒకప్పుడు చిరు, మోహన్ బాబుల మధ్య సీన్ గుర్తు చేసుకుని ఇప్పుడు మనోజ్ సినిమాకు చరణ్ వెళ్లి విష్ చేసిన సన్నివేశం చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నారు సిని ప్రియులు. ఇలానే హీరోలంతా ఎలాంటి గొడవలు లేకుండా ఉంటేనే పరిశ్రమకు మంచిదని అనుకుంటున్నారు.