అమ్మో ఎంత కష్టం వచ్చింది...? జనాలంతా ఇళ్లకే అతుక్కుపోయారు. మాయాదారి కరోనా మహామ్మారి. కాలు కడపనివ్వడంలేదు. రోడ్డు మీద తిరగనివ్వడంలేదు. కనీసం ప్రశాంతంగా నలుగురితో బాతాఖానీ కొట్టుకునేందుకు అవకాశం కూడా లేదు. ఛీ ఛీ అనుకుంటూనే జనాలు ఇళ్లకే అతుక్కుని ఉంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సెంద్రబాబు కామెడీ జనాలకు మంచి బాగా వినోదం పంచుతోంది. సెంద్రబాబు కామెడీని జనాలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ప్రపంచంలో ఏ మూలాన ఏ గొప్ప జరిగినా అదంతా తన క్రెడిట్ అని చెప్పుకోవడం సెంద్రబాబు కి బాగా అలవాటు కదా ! అసలే ప్రకృతిని కంట్రోల్ చేయగల అత్యంత మహిమలు ఉన్న గొప్ప మనిషి. అటువంటి మహా మేధావి మన రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం.. పక్క రాష్ట్రాల్లో పుట్టకపోవడం వాళ్ళ దురదృష్టం. 

 

IHG
అదే కదా ఆ పసుపు రంగు పార్టీ నాయకుల ఫీలింగ్. అందుకే కదా ఇప్పుడు ఈ కరోనా సమయంలో సెంద్రబాబు ఉండి ఉంటే కరొనతో కబడ్డీ ఆదుకునేవాడు... ప్రపంచ దేశాలకు అసలు ఈ కరోనాని ఎలా కంట్రోల్ చేయాలో సలహాలు ఇచ్చేవాడు. హడావుడిగా మీడియా గొట్టాల ముందు రెచ్చిపోయేవాడు. పాపం ఈ పిచ్చి జనాలు ఏమో బాబు గారిని మూలాన కూర్చోబెట్టి చాలు చాల్లే అన్నారు. అసలు ఆ పసుపు పార్టీ వాళ్ళు చెప్పినట్టు సెంద్ర బాబు గారి పెబుత్వంలో వచ్చిన విపత్తులాంటిని ఒంటి చేత్తో అడ్డుకున్న మ.....హానుబావుడు కదా. ఇవన్నీ ఎందుకు కానీ అసలు అప్పట్లో ఉత్తరాంధ్ర లో వచ్చిన'తిత్లీ' తాట ఎలా తీశారో తెలిస్తే బాబు గారి గొప్పదనం ఏంటో అర్ధం అయిపోద్ది. 

IHG's why <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POPULATION' target='_blank' title='people-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>people</a> are opting for Jackfruit over ...

బాబు గారు కరోనా గురించి ఇప్పుడు చాలా బాధపడిపోతున్నాడు. అసలు ఈ జగన్ కి కరోనా ను ఎలా కంట్రోల్ చేయాలో తెలియడంలేదు. బాబు గారు గతంలో వచ్చిన 'తిత్లీ' తుఫాన్ ని  ఎలా కంట్రోల్ చేసాడో తెలుసుకుంటే... బాబు గారు ఎంత మ......హా మనిషో అర్ధం అయిపోతుంది. బాబు గారి పాలన లో తిత్లీ తుపాను ఏపీలోని శ్రీకాకుళం జిల్లాతో పాటు పక్కనే ఉన్న ఒడిషా రాష్ట్రంలోని గజపతి జిల్లాను కూడా చావుదెబ్బే తీసింది. అప్పుడు ఏపీకి బాబు , ఒడిశాకు నవీన్ పట్నాయక్ లు ఉన్నారు. వారిద్దరూ తిత్లీ బాధితులకు ఎలా సాయం అందిస్తున్నారన్నది ఒకసారి పోల్చుకుంటే... రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో రట్టిణి అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం సగం ఒడిషా ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. మిగతా సగం ఏపీలో ఉంటుంది. 

IHG


తిత్లీ తుపాను రాగానే ఈ గ్రామంలో ప్రధాన వీధికి అటువైపు ఒడిషా ప్రభుత్వం. ఇటువైపు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహాయక చర్యలను చేపట్టింది.  నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏమో తుపాను వచ్చిన తరువాత రోజునే తమ పరిధిలోని ఒక్కో కుటుంబానికి 50 కేజీల బియ్యం, టార్చిలైట్లు,టార్పాలిన్లు, కొవ్వుత్తులు, సోలార్ లాంతర్లతో పాటు ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయల సొమ్ముని అందించింది. అలాగే మరో రెండు వేలను బ్యాంకు ఖాతాల్లో వేసింది.

 


అదే రట్టిణి గ్రామంలో ఏపీ ప్రభుత్వ పరిధిలోని కుటుంబాలకు సెంద్రబాబు ప్రభుత్వం అందించిన సాయం ఏమిటంటే ?. ఒడిషా ప్రభుత్వం 50 కేజీల బియ్యం ఇస్తే... చంద్రబాబు ప్రభుత్వం 25 కిలోలు ఇచ్చింది. అర కేజీ పంచదార, రెండు కొవ్వుత్తులు ఇచ్చి మామ అనిపించింది. అది కూడా అక్కడి జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాల మీద.ఒడిషా ప్రభుత్వం ఇంటికి వెయ్యి రూపాయల నగదు, మరో రెండు వేలు బ్యాంకు ఖాతాలో వేస్తే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పైసా ఇవ్వలేదు.

IHG

 అప్పుడు మిగతా జిల్లాల్లో  పరిస్థితి  బాగానే ఉన్నా బాబు గారికి మాత్రం మనసు రాలేదు. వెనకబడి ఉన్న  ఒడిషా ముందు ఏపీ పరువు తీసేలా చంద్రబాబు తిత్లీ సమయంలో వ్యవహరించారు. పైగా తానే మొత్తం తిత్లీని కంట్రోల్ చేసినట్టుగా విజయవాడలో భారీ హోర్డింగ్స్ పెట్టించి బాగా ప్రచారం అయితే చేసుకున్నారు. 

 

IHG

 కష్టమైనా... నష్టమైనా ... ఏపీలో ప్రభుత్వ శక్తికి మించి జనాలు ఇబ్బంది పడకుండా జగన్ ప్రభుత్వం ఇంటిలో వెయ్యి రూపాయలు, రేషన్ ద్వారా సరుకులు విడతలవారీగా అందిస్తున్నారు. అది కూడా రాష్ట్రమంతా ఇస్తున్నా... బాబు గారు ఇంటికి ఐదు వేలు ఇవ్వాలంటూ తమ పార్టీ ఎంపీలు, ఎమ్యెల్యేల ద్వారా దీక్షలు చేయిస్తూ మానసిక ఆనందం పొందుతున్నాడు.పావలా పనిచేసి పది రూపాయలు ప్రచారం చేసుకోవడం రాకపోవడంతో జగన్ ఇలా టీడీపీ నేతల విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: