
అమరావతి పరిరక్షణ ఉద్యమం ఎల్లోమీడియాలో మాత్రమే కనిపిస్తోంది. ఇంతోటి దానికి అమరావతి పరిరక్షణ ఉద్యమం 150 రోజులుగా నిరాఘాటంగా సాగుతోందంటూ చంద్రబాబునాయుడు ట్విట్టర్ వేదికగా ఘనంగా పొగడటమే విచిత్రంగా ఉంది. కులముద్రలు, అవమానాలు, లాఠీఛార్జీలు, అరెస్టులను కూడా తట్టుకుని ఇన్ని రోజులుగా ఉద్యమం జరగటం నిజంగా చరిత్రట. రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి కోసం మొదలైన ఉద్యమం మొదటి నుండి స్పాన్సర్డ్ ఉద్యమంగానే ప్రచారంలో ఉంది.
కేవలం చంద్రబాబు సామాజికవర్గంలోని ప్రముఖులు, చంద్రబాబు మద్దతుదారులు, టిడిపిలోని కీలక నేతల పెట్టిన పెట్టుబడులను రక్షించుకోవటమే ధ్యేయంగా చంద్రబాబు, ఎల్లోమీడియా కలిపి ఉద్యమం చేయిస్తున్నట్లు మిగిలిన ప్రాంతాల్లోని జనాలకు ఎప్పుడో అర్ధమైపోయింది. టిడిపి హయంలో సుమారు 4 వేల ఎకరాలను ఇన్ సైడర్ ట్రేడింగ్ లో దోచుకున్న భూముల విలువలు పడిపోకుండా చూసుకోవటంలో భాగంగానే పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించి ఉద్యమాలు చేయిస్తున్నారనే ఆరోపణలకైతే కొదవేలేదు. దానికి తగ్గట్లే ఉద్యమం కనీసం రాజధాని ప్రాంతంలోని 29 గ్రమాల్లో కూడా సాగలేదు. మొత్తం మీద ఓ ఆరేడు గ్రామాల్లో మాత్రమే ఆందోళనలని, ఉద్యమాలని గోల చేస్తున్నారు.
నిజంగా చెప్పాలంటే అమరావతి పరిరక్షణ ఉద్యమం కేవలం ఎల్లోమీడియాలో మాత్రమే కనబడుతోంది. ఓ ఇంట్లో నలుగురు కూర్చుని సేవ్ అమరావతి అనే బోర్డులు పెట్టుకుంటే అది అమరావతి పరిరక్షణ ఉద్యమం అయిపోతుందా ? దాన్ని ఎల్లోమీడియా ఫ్రంట్ పేజీల్లో ప్రముఖంగా వేస్తే జనాలు ఉద్యమం జరుగుతున్నట్లు నమ్మేస్తారా ? అమరావతి కోసం జరుగుతున్న పోరాటంలో మొదటి నుండి ఇదే తంతు. జోలెపట్టి చందాలు వసూళ్ళు చేసి వెనకనుండి చంద్రబాబు అండ్ కో మాత్రమే ఉద్యమాన్ని నడిపిస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే.
రాజధాని నిర్మాణమనే ముసుగులో చంద్రబాబు అండ్ కో చేసిన భూ దోపిడి అందరికీ తెలిసిపోయింది. దాన్ని సమర్ధించుకోవటానికి ఎల్లోమీడియా అండతో చంద్రబాబు అండ్ కో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం అనే డ్రామాలు మొదలుపెట్టింది. నిజానికి టిడిపి లేదా చంద్రబాబు సామాజికవర్గం మొదలుపెట్టిన ఉద్యమంపై రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోని జనాలు ఎవరూ పెద్దగా ఆసక్తి చూపలేదన్నది వాస్తవం. అంతెందుకు రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉద్యమంపై పెద్దగా సానుకూలత కనబడలేదు.
అమరావతి పరిరక్షణ ఉద్యమం మొదలై ఈరోజుకు 150 రోజులు. కులముద్రలు, అవమానాలు, అరెస్టులు, లాఠీ దెబ్బలు... ఇలా ప్రభుత్వం పెట్టిన అన్నిరకాల హింసలనూ తట్టుకుని అమరావతి కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న పోరాటం ఒక చరిత్ర. #AmaravatiAgitation150Days#SaveAmaravati pic.twitter.com/a29S5YidP5
— N chandrababu naidu #StayHomeSaveLives (@ncbn) May 15, 2020
కరోనా వైరస్ సమస్య వచ్చి రాజధాని తరలింపు అర్ధాంతరంగా ఆగిపోయింది. లేకపోతే రాజధాని విశాఖపట్నానికి ఎప్పుడో వెళ్ళిపోయేదే. ఒకవేళ రాజధాని తరలింపు వివాదం కోర్టులో ఉందని అనుకున్నా కనీసం ముఖ్యమంత్రి కార్యాలయమైనా ఎప్పుడో తరలిపోయుండేదే అనటంలో సందేహం లేదు. రాజధాని తరలింపు లేదా సిఎంవో తరలి వెళ్ళిపోవటం అన్నది ఖాయమని జనాలందరూ మానసికంగా సిద్ధమైపోయారు.