మహానుభావులు ... నలభై ఏళ్ల రాజకీయ జీవితం లో మచ్చలేని సెంద్రుడు. తిమ్మిని బమ్మి చేయగల ప్రపంచ మేధావి. అందుకే జయము జయము చంద్రన్న అంటూ పాటలు పాడుకుంటూ ఎన్నికల ప్రచారం చేసిన తెలుగు తమ్ముళ్లంతా ఇప్పుడు గుర్రుగా చూస్తున్నారు. పార్టీ కోసం అష్టకష్టాలు పడి గొంతు చించుకుని ఎన్నికల ప్రచారం  చేసినా ఫలితం చేదుగానే వచ్చిందని, ఇదంతా బాబు గారి చలువేనని, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా అవినీతికి గేట్లు తెరిచేయడంతో ఇప్పడు ఈ పరిస్థితి దాపురించిందని, మొన్నటి వరకు తెలుగు తమ్ముళ్లంతా బావురమంటే ..? ఇప్పుడు అధినేత చంద్రబాబు, ఆయన పుత్ర రత్నం లోకేష్ హాయిగా సైకిల్ సవారీలు చేసుకుంటూ హాయిగా సేదతీరుతున్నారని, మేము మాత్రం ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ, అష్టకష్టాలు పడుతూ ఉంటామని, ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకుని మొహం చాటేసిన పార్టీ అతిధి నాయకులు లేకయినా మేము మాత్రమే పోరాటం ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నామని..! దీని కారణంగా అధికార పార్టీ వైసీపీ ఇచ్చే బహుమతులు అంటే పోలీసు కేసులు, వైసీపీ కార్యాకర్తల తిట్టే తిట్లు, ఇలా అన్నీ భరిస్తూ పార్టీని మోసుకొస్తుంటే ...? మీరేంటయ్యా 

 

IHG


హైదరాబాద్ లో మనవడితో రిలాక్స్ అవుతున్నారు...? ఇదేమన్నా బాగుందా బాబు గారు ? పోనీ కరోనా భయం వేసి మీరు ఇంట్లో దాక్కున్నారు, మీకు 70 ఏళ్ళు వచ్చాయి పోనీలే  అనుకుంటే కనీసం మీ పుత్ర రత్నం అయినా రంగంలోకి దిగాలి కదా ? ఆయనేంటయ్య చక్కగా హైదరాబాద్ లో కూర్చుకుని రోడ్లపై సైకిల్ తొక్కుకుంటూ షికార్లు చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. మేము మాత్రం ఇక్కడ పార్టీ కోసం మా సర్వస్వం అర్పించుకుంటాము. ఆ జగన్ ప్రభుత్వం ఎదురుతిరిగిన అందరి మీద కక్ష కట్టి ప్రతాపం చూపిస్తోంది. ప్రభుత్వాన్ని ప్రశించిన వారు ఎంత పెద్ద వారు .. ఎంత పలుకుబడి ఉన్నవారు అయినా తగ్గకుండా చుక్కలు చూపిస్తుంటే మీరేంటయ్యా పట్టించుకోరు...? 

 

IHG

 

అంటే మేమే ప్రభుత్వాన్ని తిట్టి ... మేమే ప్రజా పోరాటాలు చేసి మేమే కేసులు ఎదుర్కుంటూ, మేమే జైళ్లకు వెళ్తూ, మేమే ఆర్ధికంగా కుంగిపోతుంటే ఇక మీరెందుకయ్యా ? 
జూమ్ యాప్ లో వీడియో కాన్ఫిరెన్స్ లు పెడితే సరిపోతుందా ? ఏపీ లో పార్టీ మీకు అక్కర్లేదా ? కష్టాలు మావి. పలుకుబడి, పదవులు మీవా ? పార్టీ పరిస్థితి ఇంతేనా ? మీరు పట్టించుకోరా ? ఏ విషయంలోనూ సమర్థుడు అని నిరూపించుకోలేని మీ పుత్ర రత్నాన్ని కూడా మేము భరించాల్సిందేనా ? ఇంతేనా ..? మీరు, మీ వారసుడు ఇప్పట్లో ఇక్కడకి రారా ? అంటూ తెలుగు తమ్ముళ్లు ఇప్పుడు గుర్రుగా అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: