హైకోర్టు నిర్ణయాలపై వ్యాఖ్యానాలు పెరుగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం రాష్ట్రంలో గతంలో 49 మందికి నోటీసులు జారీ చేయాల్సిందిగా ఆదేశించింది. శుక్రవారం మరో44 మందికి నోటీసులు జారీచేసింది. ఈ నే పథ్యంలో అసలు వీరు చేసిన వ్యాఖ్యలు బాధ్యతతో కూడుకున్నవేనా? లేక నోటి దురదకొద్దీ(ప్రతిపక్షం ఆరో పిస్తున్నట్టుగా) చేసిన వ్యాఖ్యలా అనేది చర్చకు వచ్చాయి. ఇప్పుడు ఇవే అంశాలపై వైసీపీలోనూ చర్చకు డుస్తుండడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. ఇటీవల దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు వలస కార్మికుల విషయంపై స్పందించింది.
వలస కార్మికులు నడిరోడ్డుపై మండుటెండలో నడిచి వెళ్తున్నారని, వారికి ప్రభుత్వాలు ఆదరవు అందించేలా చర్యలు తీసుకోవాలని కొందరు సుప్రీం కోర్టులో పిటిషన్లు వేశారు. వీటిని విచారించిన సుప్రీం కోర్టు.. ఈ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలకు మేం చెప్పేది ఏమీలేదని, మేమేమన్నా.. ఖాళీగా కూర్చున్నామా? ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి అంటూ.. వలస కార్మికుల సమస్యలపై స్పందించేందుకు నిరాకరించింది. దీంతో సుప్రీం కోర్టుపై ప్రజాస్వామ్య వాదులు అందరూ.. పార్టీలకు అతీతంగా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సోషల్ మీడియాలో దుమ్మెత్తిపోశా రు(జాతీయ మీడియా ఇలానే రాసింది).
దీంతో ఆయా విమర్శలపై సుప్రీం కోర్టు మర్నాడే స్పందించింది. తనంతట తానుగా తాను తోసిపుచ్చిన పుటిషన్లపై విచారణ చేపట్టి.. వలస కార్మికులకు ప్రభుత్వాలు అండగా ఉండాలని, రైళ్లలో చార్జీలను ఒక్క పైసా కూడా వారి నుంచి తీసుకోవద్దని, ఆహారం కూడా ఇవ్వాలని సూచించింది. వ్యవస్థ ఏది.. అనే విషయాన్ని కొంత సేపు పక్కన పెడితే.. ఎవరు ఉన్నప్పటికీ.. ప్రజల కోసమే. వారి బాగు కోసమే. రాజ్యాంగం కూడా అంతే! విస్తృత ప్రజాప్రయోజనానికి గొడుగు పట్టడమే విహిత ధర్మంగా రాజ్యాంగ పీఠిక స్పష్టం చేస్తోంది. ఈ సమయంలో పంతాలకు పట్టింపులకు తావులేకుండా ఉండాల్సిన అవసరం అన్ని వ్యవస్థలపైనా ఉంది.
ప్రభుత్వాలు తప్పులు చేస్తే.. సరిదిద్దడానికి న్యాయవ్యవస్థ, రాజ్యాంగం అనే రెండు ధర్మసూక్ష్మాలు కాచు కుని ఉంటాయి. అయితే, ఈ రెండింటిలో రాజ్యాంగం తప్పు చేసే అవకాశం లేదు. అందుకే న్యాయవ్యవ స్థ.. ఒకటికి రెండు సార్లు.. ఆలోచించుకుని తీర్పు చెప్పడంలో తప్పులేదని భారత అత్యున్నత న్యాయస్తా నం సుప్రీం కోర్టుకు చీఫ్ జస్టిస్‌గా చేసిన దివంగత కోకా సుబ్బారావు అనేక సందర్భాల్లో ఉటంకించారు.
ఇక, ఇప్పుడు ఏపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. ప్రజాప్రతినిధులుగానో లేక పౌరులు గానో.. ఏమైనా.. ఒకింత ఆవేశం ప్రదర్శించినా.. వారిని సరిదిద్దాల్సిన అవసరం న్యాయ దేవతకు ఉందనడంలో సందేహం లేదు. అయితే, అతి తల్లి ప్రేమలా ఉంటే.. తరతరాలకు నిలిచిపోయే స్పూర్తిని ప్రతిపాదించడమే అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.