అవును మీరు చదివింది నిజమే. తెలుగుదేశంపార్టీలోని ముగ్గురు తిరుగుబాటు ఎంఎల్ఏలపై చంద్రబాబునాయుడు ఎటువంటి యాక్షన్ తీసుకునేందుకు లేకుండా మరో జూనియర్ మోస్ట్ ఎంఎల్ఏ రక్షణగా నిలిచిందని పార్టీలోనే చర్చ జరుగుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటారా ? మొన్న రాజ్యసభ ఎంపిల ఎన్నికకు పోలింగ్ జరిగిన విషయం గుర్తుంది కదా. ఆ పోలింగ్ లో  టిడిపిలో ముగ్గురు  తిరుగుబాటు ఎంఎల్ఏలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం పార్టీ తరపున పోటి చేసిన వర్ల రామయ్యకు ఓట్లేసినా వేసినా చెల్లకుండా జాగ్రత్తపడ్డారు. అంటే తాము వేసిన ఓట్లు ఇన్ వాలీడ్ అయ్యేట్లుగా వ్యూహం ప్రకారం ఓట్లేశారు. ఓటు వేసింది టిడిపికే అయినా వాళ్ళు 1 అనే అంకె వేయకుండా టిక్ పెట్టటంతో అవి ఇన్ వాలీడ్ అయిపోయాయి.

 

సరే వీళ్ళ వ్యవహారాన్ని పార్టీలో అందరు ముందునుండి అనుమానిస్తునే ఉన్నారు. కాబట్టి అందరి అంచనాలకు తగ్గట్లే వీళ్ళు ఓటింగ్ చేశారు. వీళ్ళ వ్యవహారాన్ని ముందుగానే ఊహించారు కాబట్టి ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు. అయితే ఇదే సమయంలో నాలుగో ఓటు కూడా ఇన్ వాలీడ్ అవ్వటమే చంద్రబాబునాయుడు తో పాటు మొత్తం లీడర్లందరినీ షాక్ కు గురిచేసింది. నాలుగో ఓటెవరిదయ్యా అంటే రాజమండ్రి ఎంఎల్ఏ ఆదిరెడ్డి భవానీది.  నిజానికి భవాని ఓటు ఇన్ వాలీడ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే బ్యాలెట్ పేపరన్నా, ఓటన్నా తెలీని అమయాకురాలు కాదు ఎంఎల్ఏ. పైగా రాజ్యసభ ఎన్నికల్లో  ఓటు ఎలా వేయాలనే విషయంలో పార్టీ రెండు రోజుల మాక్ పోలింగ్ లో ట్రైనింగ్ కూడా ఇచ్చింది.  ఉన్నత విద్యావంతురాలైన భవానీ తన ఓటును ఉద్దేశ్యపూర్వకంగానే ఇన్ వాలీడ్ అయ్యేట్లు చేసిందని అందరికీ అర్ధమైపోయింది.

 

అయితే ఇన్ వాలీడ్ ఓటులో భవానీని నిలదీసేంత సీన్ చంద్రబాబుకు లేదని కూడా అందరికీ తెలుసు. నిలదీసేంత సీనే లేనపుడు ఇక యాక్షన్ తీసుకునేంత ధైర్యం చంద్రబాబు చేస్తాడని కూడా ఎవరు అనుకోవటం లేదు.  కాబట్టి తన ఓటును ఇన్ వాలీడ్  చేసినా భవానీ అయితే సేఫే. మరి ఇదే విషయంలో తమ ఓట్లను ఇన్ వాలీడ్ చేసుకున్న మిగిలిన ముగ్గురి విషయం ఏమిటి ?  రాజ్యసభ ఎన్నికల విషయంలో  టిడిపి విప్ జారీ చేయటమే విచిత్రం. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికలో విప్ చెల్లదు. ఏదో ఎంఎల్ఏలను భయపెట్టేందుకు విప్ అంటూ హడావుడి చేస్తారంతే.

 

కాబట్టి విప్ ఉల్లంఘన, దాని ఆధారంగా చర్యలు తీసుకునే  సమస్యేలేదిక్కడ. ఇక ఉద్దేశ్యపూర్వకంగానే తమ ఓటును చెల్లకుండా చేశారనే విషయంలో ముగ్గురు ఎంఎల్ఏలపై చర్యలు తీసుకునే  అధికారం చంద్రబాబుకు ఉంది.  ఈ విషయంలోనే చంద్రబాబుకు ఇబ్బందులు మొదలవుతున్నాయి. అవేమిటంటే ముగ్గురు ఎంఎల్ఏలపై ఒకవేళ చర్యలు తీసుకుంటే మరి ఇదే పనిచేసిన భవానీ మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా ?  మొత్తం నలుగురు ఎంఎల్ఏలు తమ ఓట్లను ఇన్ వాలీడ్ చేసుకున్నపుడు ముగ్గురిపై చర్యలు తీసుకుని నాలుగో ఎంఎల్ఏను వదిలేసే అవకాశం లేదు. ఒకవేళ చంద్రబాబు అదేపని చేస్తే వెంటనే  వాళ్ళు చంద్రబాబుపై కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది.

 

అలాగని ముగ్గురు ఎంఎల్ఏలతో కలిపి భవానీపైన కూడా  చర్యలు తీసుకోవటం చంద్రబాబుకు సాధ్యమూ కాదు. అంటే భవానీని దృష్టిలో పెట్టుకుని మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలపైన కూడా ఏ విధమైన చర్యలు తీసుకోకుండానే వదిలేయాల్సుంటుంది. భవానీపై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేడు ? ఎందుకంటే భవానీ అంటే ఉత్త భవానీ మాత్రమే కాదు. ఆతిరెడ్డి భవానీ దివంగత నేత కింజరాపు యర్రన్నాయుడు కూతరు. అంటే శ్రీకాకుళం ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడుకు స్వయానా చెల్లెలు. ఇప్పటికే బాబాయ్ అచ్చెన్నాయుడు అరెస్టు విషయంలో చంద్రబాబు, చినబాబు లోకేష్ పార్టీలో ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమయంలో భవానీపై చర్యలంటే ఇంకేమన్నా ఉందా ? అందుకనే  భవానీ కారణంగా మిగిలిన ముగ్గురు ఎంఎల్ఏలు కూడా ఫుల్ సేఫ్.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: