మామను చంపి పార్టీని లాక్కున్నోడు ఈడా నాకు చెప్పేది. చంద్రబాబు పెద్ద 420 , చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాన్న ఖర్జుర నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు. నువ్వు నాకు టికెట్ ఇచ్చావా ? నువ్వు నాకు రాజకీయ బిక్ష పెట్టావా ? నువ్వు నాకు రాజకీయ బిక్ష పెట్టలేదు. నాకు రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, జగన్, రాజశేఖరరెడ్డి వీళ్ళు మాత్రమే నాకు రాజకీయ బిక్ష పెట్టారు. నువ్వు నాకు బిక్ష పెట్టావా ? నీ బతుకంతా అబద్దాలు చెప్పడమే. మామకు వెన్నుపోటు పొడిచి పార్టీ ని లాక్కున్న నువ్వా నాకు చెప్పేది ? ఇలా ఒకటి కాదు రెండు కాదు కొడాలి నాని మీడియా ముందుకు వచ్చాడు అంటే అది ఖచ్చితంగా చంద్రబాబు మీద తిట్ల పురాణం ఇప్పేందుకే అని అందరికీ అర్ధం అయిపోతుంది. అసలు నాని తిట్ల పురాణం తట్టుకోవడం కష్టమని తెలిసినా పదే పదే ఆయన్ను ఏదో ఒక రకంగా తిట్టి తిట్టించుకోవడం బాగా అలవాటయిపోయింది.



చంద్రబాబు లోకేష్ మాత్రమే కాదు, దేవినేని ఉమాకి కూడా నాని తో తిట్టించుకుంటే కానీ నిద్రపట్టదు అన్నట్టుగా తిట్టి తిట్టించుకోవడం బాగా అలవాటయిపోయింది. పదవి కోసం అన్నాను చంపినా నువ్వెంట్రా నాకు చెప్పేది ? ఉమక్కాయ్ ? అంటూ వ్యంగ్యంగా తిట్టే తిట్లు వైరల్ అవ్వడంతో పాటు నాని తిడుతున్న తిట్లు జనాలు కూడా బాగా ఎంజాయ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇక పప్పు నాయుడు అంటూ లోకేష్ ను ఉద్దేశించి నాని తిట్టే తిట్లు అరాచకమనే చెప్పాలి. నాని తిట్లకు దేవి నేని ఉమా స్పందించినా, లోకేష్, చంద్రబాబు మాత్రం గప్ చిప్ అయిపోతున్నారు. నాని ఎంత దారుణమైన తిట్లను తిడుతున్నా నోరు మెదిపి ఖండించేందుకు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ముందుకు వచ్చే పరిస్థితి లేదు.

 అసలు నాని ని కదపడం అంటే అగ్నిగోళాన్ని దగ్గ నుంచి చూసినట్టే. ఇక అసెంబ్లీ లో అయినా నాని ఇదే రేంజ్ ఓ చంద్రబాబు మీద ఫైర్ అయిపోతుంటారు. ఎన్ని విమర్శలు చేసినా చంద్రబాబు నోరు మెదిపి సమాధానం చెప్పే పరిస్థితి అసెంబ్లీలో కానీ, బయటా కానీ లేదు. నాని తిట్ల దండకం విని అటు లోకేష్, ఇటు చంద్రబాబు పులకరించడం తప్ప.

మరింత సమాచారం తెలుసుకోండి: