
ఇప్పటివరకు పారీని నమ్ముకుని పార్టీలోనే ముసలి వాళ్ళం అయిపోయాం మా పరిస్థితి ఏం గాను అంటూ మొరపెట్టుకుంటే పోన్లే ఎవరికి తప్పినా తప్పకపోయినా నాకు తప్పదు కదా నేనే ఉంటాలే అని అమ్మ దయదలిచి కనికరం చూపించారు. ఇప్పుడేమో తెలంగాణలోనూ అదే సీన్. ఆ కారు పార్టీ రాష్ట్రమంతా స్పీడ్ బ్రేకర్లు లేని రోడ్ల మీద దూసుకుపోతుంటే, మనకేమో సొంత పార్టీ వొల్లే స్పీడ్ బ్రేకర్లుగా మారిపోయారు.ఏదో నానా కాష్టలు పడి పార్టీని ఓ ఒడ్డుకి చేర్చి ఆ సీఎం కుర్చీ ఏదైతే ఉందో దాన్ని ఎక్కాలని ఆ రేవంత్ చూస్తుంటే ఇప్పుడేమో సొంత పార్టీ వొళ్ళు ఎక్కడబడితే అక్కడ తిట్టేసుకుని, వీలైతే కొట్టేసుకుని నానా రచ్చా చేసేస్తున్నారు.
అసలు నువ్వెవరవయ్యా ఆ కుర్చీ ఎక్కడానికి ఎక్కితే గిక్కితే, మేమెక్కలి కానీ అంటూ ఒకరిమీద ఒకరు తిట్టిపోస్తూ హడావుడి చేసేస్తూ తన్నుకుంటూ ఉంటే ఆ కారు పార్టీ, ఆ కాషాయ పార్టీ చంకలు గుద్దుకుంటూ వినోదం చూస్తున్నాయి. కాస్త మీ కొట్లాటలు, తన్నులాటలు ఆపి పార్టీని జాగ్రత్తగా చూసుకోకపోతే ఒకప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండేందట అని మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది. అయ్యా బాబు మీకో దండం కాస్త ఆ గోల ఆపి ఆ పోరాటం ఏదో, ఆ తిట్ల దండకం ఏదో, ఆ తన్నులాట ఏంటో ? అసలు మీ వీర ప్రతాపం ఏంటో మీ రాజకీయ శత్రువుల మీద చుపించాడయ్యా...!