బిజెపి అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి పాపం ఎల్లోమీడియా బాగా ఇబ్బంది పడిపోతోంది. గతంలో చంద్రబాబునాయుడు అజెండానే తాము బిజెపితో చెప్పించినట్లుగా ఇపుడు సాధ్యం కావటం లేదు. వీర్రాజుకు ముందు వరకు బిజెపిలో కూడా ఎల్లోమీడియా ఆటలే బ్రహ్మాండంగా సాగిన విషయం అందరు చూసిందే. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబు+ఎల్లోమీడియా+బిజెపి ఏదతాటిపై నడిచేవి. ఎప్పుడైతే పార్టీ అధ్యక్షుడిగా వీర్రాజు అపాయింట్ అయ్యాడో అప్పటి నుండే ఇటు చంద్రబాబు అటు ఎల్లోమీడియాకు ఒక్కసారిగా కష్టాలు మొదలయ్యాయి. ప్రత్యక్షంగా చంద్రబాబుకు వచ్చిన కష్టం ఏమి లేకపోయినా ఎల్లోమీడియా మాత్రం డైరెక్టుగానే ఇబ్బందులు పడుతోంది.
ఇందుకు వీర్రాజుతో ఏబిఎన్ చానల్లో వచ్చి బిగ్ డిబేటే సాక్ష్యం. ఈ ఛానల్లో ఏ పేరుతో కార్యక్రమం నిర్వహించినా అంతిమ టార్గెట్ మాత్రం జగన్మోహన్ రెడ్డిని తిట్టించటమే అని అందరికీ తెలిసిందే. జగన్ ను కసితో ఎంత ఎక్కువ తిడతారని అనుకుంటారో అలాంటి వాళ్ళనే ఏరికోరి మరీ ఛానల్లో జరిగే డిబేట్లకు పిలుస్తుంటారు. ఈ ఛానల్లో జరిగే డిబేట్లలో ఎవరైనా జగన్ ను తిట్టకపోయినా లేకపోతే చంద్రబాబును తప్పుపడుతూ మాట్లాడినా అంతే సంగతులు. ప్రస్తుతం వీర్రాజుతో డిబేట్ లో జిరిగిందిదే. డిబేట్ లో యాంకర్ ఏమో జగన్ తో పాటు బిజెపిని టార్గెట్ చేసి మాట్లాడాడు. ఇదే సమయంలో వీర్రాజు ఏమో చంద్రబాబును+ఏబిఎన్ చానల్ ను టార్గెట్ గా చేసుకుని రెచ్చిపోయాడు.
అసలే ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన వీర్రాజును కెలికితే ఏమవుతుందో అందరికీ అనుభవమే. తాము అనుకున్నట్లుగా వీర్రాజు ప్రభుత్వంపై విరుచుకుపడటం లేదని, జగన్ ను టార్గెట్ గా చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేయటం లేదన్న మంట డిబేట్ లో స్పష్టంగా తెలిసిపోతోంది. పైగా తాము అనుకున్నట్లు కాకుండా చంద్రబాబును తమ ఛానల్ ను కలిపి వాయించేసేటప్పటకి యాంకర్ రెచ్చిపోయాడు. వీర్రాజు ఏమి మాట్లాడుతున్నాడో జనాలకు అర్ధంకాకుండా కావాలనే సదరు యాంకర్ రన్నింగ్ కామెంటరీ ఇచ్చేందుకు నానా అవస్తలు పడ్డాడు. యాంకర్ రన్నింగ్ కామెంటరీ ఇచ్చేకొద్దీ వీర్రాజు కూడా గొంతును పెంచి మరింతగా రెచ్చిపోవటం అందరూ చూసేఉంటారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిపైన, అవినీతిపైన, కేంద్రం ఇచ్చిన రూ. 7200 కోట్లను ఏ విధంగా ఖర్చు చేశారనే విషయాన్ని చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని వీర్రాజు నిలదీయటంతో యాంకర్ కు ఏమి చేయాలో దిక్కుతోచలేదు.
ే పద్దతిని అనుసరించాడు.ంకర్ పి)డు జయప్రకాెంటరీ ండా చంద్రబాబును తమ టి నుండే ోలేదన్న వి పాత వినియోగదామొన్నటికి మొన్న లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ (జేపి)తో జరిగిన చర్చలో కూడా యాంకర్ ఇదే పద్దతిని అనుసరించాడు. జేపిని చర్చల్లోకి పిలిపించి మూడు రాజధానులు, కేంద్రం అఫిడవిట్, న్యాయస్ధానాల జోక్యం లాంటి అంశాలపై జగన్ ను తిట్టిద్దామని అనుకున్నాడు. కానీ యాంకర్ ఆలోచనలకు విరుద్ధంగా జేపి తన వాదన వినిపించాడు. పై మూడు అంశాల్లోను జగన్ వాదననే జేపి సమర్ధించాడు. దాంతో మొదటిసారి జేపి మాట్లాడేసిన తర్వాత రెండోసారి మాట్లాడేందుకు పెద్దగా అవకాశం ఇవ్వలేదు. మొత్తానికి జేపి దగ్గర కాబట్టి సరిపోయింది. కానీ వీర్రాజు మాత్రం చంద్రబాబు+ఛానల్ ను ఉతికి ఆరేశాడనే చెప్పాలి.