జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు... ఇద్దరు ఉప్పు నిప్పులాంటి వాళ్ళు. రాజకీయంగా ఒకరిని మరొకళ్ళు దెబ్బ తీసుకోవటం కోసం ఒకరిపై మరొకరు ఎత్తులు పై ఎత్తులు వేసుకోని రోజంటూ ఉండదు. అలాంటి వీళ్ళిద్దరు ఓ విషయంలో ఒకే విధంగా ఆలోచించారు. అంటే ఇద్దరు ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకమైపోయినట్లే. ఇంతకీ అదేమిటంటే ప్రజాప్రతినిధులపై ఉన్న కేసులను ఎత్తేయటం. అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు కూడా తన పార్టీ నేతలపై ఉన్న కేసులను ఎత్తేశాడు. చట్టము, న్యాయము ఏవీ చూడకుండా ఏకపక్షంగా తన మద్దతుదారులు, నేతలపై ఉన్న కేసులన్నింటినీ ఎత్తేశాడు. కాలం గిర్రున తిరిగి జగన్ అధికారంలోకి రాగానే ఇపుడు తాను చేస్తున్నది కూడా అచ్చంగా  ఇదే.




అప్పట్లో తన పార్టీ నేతలు, మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలు సుమారు 251 మందిపై ఉన్న క్రిమినల్ కేసులను చంద్రబాబు ఎత్తేశాడు. న్యాయపరంగా కేసులు ఎత్తేయటం చెల్లదని తెలిసినా ప్రత్యేకంగా జీవోలిచ్చి మరీ కేసులను మాఫీ చేసేశాడు. అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ లాంటి చాలామందిపై కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. అయితే అప్పట్లో చంద్రబాబు చర్యను వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో ప్రశ్నించాడు. ఆళ్ళ పటీషన్ పై కోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వటం వేరే సంగతి. ఆ నోటీసుకు ప్రభుత్వం ఏమని సమాధానం చెప్పిందో కూడా ఎవరికీ తెలీదు. తర్వాత జరిగిన ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోవటంతో కేసుల ఉపసంహరణను అందరు మరచిపోయారు.




ఐదేళ్ళు గడిచేసరికి సీన్ మారిపోయింది. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్ కూడా ఇపుడు అదే పనిచేస్తున్నాడు. తన మంత్రులు, ఎంపిలపై నమోదైన కేసులను ఎత్తేస్తున్నాడు. కొడాలినాని, మిథున్ రెడ్డి, అవినాష్ ినాెడ్డి, మితర్టులు పెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. మాు. నిజానికి తెల్లరేరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళపై నమోదైన కేసులను ఉపసంహరించుకుంది. నిజానికి ప్రజాప్రతినిధులపై నమోదయ్యే కేసుల్లో కక్షసాధింపు కొద్ది అధికారపార్టీలు పెట్టేవి కొన్నుంటాయి. ప్రజాప్రతినిధుల హోదాల్లో అడ్డదిడ్డమైన పనుల్లో వేళ్ళు పెట్టి ఇరుక్కున్నపుడు నమోదయ్యే కేసులు కొన్నుంటాయి. ఇక ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో నమోదయ్యే కేసులు కూడా ఉంటాయి. ఏ పద్దతిలో కేసు నమోదైనా కేసు కేసే కదా. తనపై అధికారపార్టీ అన్యాయంగా కేసు నమోదు చేసిందని సదరు ప్రజాప్రతినిధి నిరూపించుకోగలిగితే కోర్టు కేసులను కొట్టేస్తుంది. కక్షసాధింపుతో పెట్టిన కేసులు కూడా కోర్టుల్లో నిలవవు.




ఒకవైపు ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వెంటనే పూర్తి చేయమని సుప్రింకోర్టు ఈ మధ్యే హైకోర్టులకు ఆదేశాలు జారీచేసింది. ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టాలన్న డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ నేపధ్యంలోనే జగన్ ప్రభుత్వం తొందరపడి కేసులను ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఏముంది ? కొట్టేసే కేసులే అయితే కోర్టులే కొట్టేస్తాయి కదా. అప్పుడు రాజమార్గంలోనే ప్రజాప్రతినిధులు హ్యాపీగా ఉండచ్చు. అలాకాని పక్షంలో ఇపుడు కొట్టేస్తున్న కేసుల ఘటనపైన కూడా మరో కేసయ్యే ప్రమాదం ఉంది జాగ్రత్త సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: