ఎంత మోసం ఎంత మోసం ! మోదీ ఇంత మోసం చేస్తాడా ? ఆయన పుట్టిన రోజుకి సన్మానాలు, శాలువాలతో హడావుడి చేద్దామనుకుంటే .. నాకే దెబ్బ కొట్టి ఆ మోదీ మోసం చేసేశాడు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఆయనకు సన్మానాలు చేయాలి ? అమరావతి పేరుతో నేను హడావుడి చేసి, ఏ దేశం వెళితే ఆ దేశం రాజధాని మాదిరిగా అమరావతిలో రాజధాని నిర్మిస్తామని చెప్పి ఐదేళ్ళపాటు అలా అలా కాలక్షేపం చేస్తే అప్పుడు నన్ను అందరూ ఆడిపోసుకున్నారు. పోనీలే ఈ జనాలకు నేను కడదామనుకున్న రాజధాని ఎలా ఉంటుందో గ్రాఫిక్స్ లో రకరకాల బొమ్మలు జనాలకి చూపించి, మా పచ్చ మీడియా లో పిచ్చపిచ్చగా ప్రచారం చేసుకుంటే అప్పుడు కూడా ఈ పనీ పాటా లేని ప్రతిపక్షాలు తిట్టిపోశాయి. నా విశాల హృదయంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చునేందుకు నీళ్లు కారే టెంపరరీ బిల్డింగుల కోసమే నేను ఐదు సంవత్సరాల క్రితం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి బిల్లింగ్ కట్టాను.


వర్షం వస్తే హాయిగా ఎంజాయ్ చేస్తూ, కుర్చీలో కూర్చుని గొడుగు వేసుకునే అవకాశాన్ని కల్పించాను. గంగమ్మను ఆఫీస్ రూమ్ లోకి తెచ్చి పెట్టాను. దీనికోసం నానా హంగామా చేసిన ప్రతిపక్షాలకు అవకాశమే లేకుండా బ్రహ్మాండమైన బిల్డింగులు కట్టేసాను. ఇక ఆ గ్రాఫిక్స్ లోని బిల్డింగులను కడదాం అనుకునేలోపే ఈ జనాలు నన్ను నమ్మకుండా, ఆ జగన్ ను నమ్మి నన్ను ఇంటికి పంపేశారు . ఇప్పుడేమో నేను నా కొడుకు, ఏదో భారీగా తినేసాము అంటూ ఆ సిబిఐని, ఏసిబిని ఉస్కో అంటూ మా మీదకు వదులుతారా ? అసలు ఇదంతా పక్కన పెడితే,  ఆ మోదీకి ఎంత ధైర్యం ? నేను నీళ్లు కారే టెంపరరీ బిల్డింగ్ కోసమే ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే, ఇప్పుడు ఎనిమిది వందల మంది ఎంపీల కోసం ఎనిమిది వందల కోట్లతో పర్మినెంట్ గా బిల్డింగ్ కట్టేస్తున్నాడు.


 అది కూడా 2022 పూర్తి చేసేస్తాడు అంట. థిస్ ఈజ్ వెరీ దారుణం. ఇప్పుడు ఈ జనాలు, ఈ మీడియా వాళ్ళు ఊరుకుంటారా ?  తాను కట్టిన బిల్డింగ్ కు ఇప్పుడు మోదీ కట్టే బిల్డింగ్ కు పోలిక పెట్టి చూసేస్తారుగా?  మోదీ తో స్నేహం చేద్దామని వెంటపడుతుంటే, ఇంత దారుణం చేస్తాడని ఊహించలేదు. అసలు నన్ను అడిగితే నేనే ప్లాన్ గీసి, నేను కట్టిన తాత్కాలిక బిల్డింగ్ తరహాలోనే ఇప్పుడు ఎంపీల కోసం బిల్డింగు కట్టించే వాడిని కదా ? నన్ను ఈ మోదీ ఎంత మోసం చేస్తాడా ? తమ్ముళ్లు మనం ఇంకా ఊరుకో వద్దు.  రండి ఆ మోదీని నిలదీద్దాం..!

మరింత సమాచారం తెలుసుకోండి: