అయ్యా ...! బాబూ పెదాన మంత్రి గారు. మా మోర ఆలకించాడయ్యా ! ఇప్పుడు దేశమంతా కరోనా చుట్టుముట్టేసింది. ఇది ఎవరూ కాదనరు. అసలు ఎన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఈ యాది ప్రతీవోళ్లకూ వచ్చేత్తుంది అని చేలా చేలా పెద్ద మనుషులే సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి మా జనాలం కూడా ఈ యాదిని పెద్దగా పట్టించుకోలేదు. ఎప్పుడు 500 సిల్లర్లో మీరు లాకు డౌను పెట్టారు. ఇప్పుడేమో 54 లచ్చల్ కి ఎల్లిపోయింది. ఇక లాభంలేదని మీరు మొత్తం లాకు ఎత్తేసి గేట్లు తెరిచేసారు. ఇక జనాలు అక్కడక్కడా మాస్కులూ, మూతికి గుడ్డలు కట్టుకుని తిరుగుతున్నారు.


మొదట్లో వాడినంతగా ఆ శానిటైజర్లు గట్టా ఇప్పుడు వాడడం లేదు. అందరూ అన్నీ వదిలేసారు. మీ గవర్నమెంటోళ్లు పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు మా జనాల ఇన్నపం ఏంటి అంటే ? కరోనా లాకు డౌన్ మొదలయినప్పటి నుంచి రోజు వరకు ఎవరికి ఫోన్ చేసినా, కరోనా మహమ్మారి దేశమంతా మొదలయిపోయింది... అంటూ లంకిచుకుని ఏదేదో చెప్పేసి బుర్ర పాడు చేసేస్తోంది. ఇప్పుడు ఫర్వాలేదు కానీ, ఈ యాది మొదట్లో ఉన్నప్పుడు ఎవడికి ఫోన్ చేసినా, పొడి దగ్గు వినిపించేది.

ఆ దగ్గు దగ్గుతుంది ఫోన్ ఎత్తినోడా ? లేక కంపెనీ వోడా అనేది తెలిసేది కాదు. మరేమనుకున్నారో ఏమో తెలియదు కానీ, ఆ దగ్గు బాధ నుంచి మమ్మల్ని విముక్తుల్ని చేశారు. ఇప్పుడూ అలాగే ఈ కాలర్ టోన్ కూడా తీష్యందయ్యా ..! వినలేక చస్తున్నాం. ఎవడికైనా అర్జంటుగా ఫోన్ చేసి చావాలంటే కరోనా మహమ్మారి ... అంటూ నిమిషం పాటు టక టకా ఏదేదో చదువుకెల్లిపోతోంది. మీరు పెద్ద మనసు కేసుని ఈ సామాన్య జనల బాధలను పట్టించుకుని ఆ బాధ నుంచి తప్పించాడయ్యా.


మీరు ఇలా కాలర్ ట్యూన్ లు పెట్టి ఎన్ని జాగ్రత్తలు చెప్పినా కొంతమంది జనాలు వినరయ్య. ఆ ఇసయం మీకే తెలవట్లేదు. అసలు ఈ టోన్ నుంచి తప్పించుకోవడానికి ఏదో చిట్కాలు ఉన్నాయన్నారు కానీ, ఆయన్ని మాలాంటోళ్ళకి ఏం తెలుత్తాయి . మీరే చిన్న మనసో, పెద్ద మనసో సేసుకుని మా చెవుల్లో జోరీగలా భయపెట్టే ఆ మాటలను తప్పించాడయ్యా మీకు పుణ్యం ఉంటది.

ఇట్లు పేమతో... మీకెంతో ఇష్టమైన మీ సామాన్యుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: