అస్సలు మారడమ్మా.. ఈ మనిషి ! ఎన్నిసార్లు తిట్టి, పో పోండయ్యా అంటూ చిరాకు పడినా అస్సలు పట్టించుకుంటే కదా ! పదే పదే బతిమిలాడినా వాళ్లు పట్టించుకోనప్పుడు ఎందుకు అన్ని సార్లు కాళ్లావేళ్లా పడి ప్రాధేయ పడడం...? వాళ్ళ కైనా ఉండాలి, మన కైనా ఉండాలి. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా ? ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్లు అంతా బాబోరు చేస్తున్న పనులకు ఆయనపై చేయాలనుకుంటున్న విమర్శలు ఇవి. అసలు మీతో మాకు పొత్తు వద్దు బాబోయ్... మీకు మాకు అస్సలు కుదరదు. 2014లో తెలిసో తెలియకో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు బాగా బుద్దొచ్చింది. ఇంకెప్పుడు పొత్తు అనే మాట అసలు మా దగ్గర వాడొద్దు. అసలు మా వెంటపడొద్ద మొర్రో అంటూ ఆ
కమలం పార్టీ వాళ్ళు పదే పదే చెబుతూ, దూరం దూరంగా జరుగుతున్నా, బాబొరు మాత్రం అవేమీ పట్టించుకోనట్టు గా వ్యవహరిస్తున్నారు.
శరణు
మహా ప్రభో అంటూ, పదేపదే
కమలం పార్టీ వెంట పడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు పెద్ద మనసుతో పొత్తుకు ఒప్పుకోవాలి. ఎంతైనా మనం మనం బరంపురం అంటూ... సెంటిమెంటును రాజేస్తూ ఏదో ఒక సందర్భంలో మనసు కరుగుతుంది అనే ఆశలోనూ, బ్రమ లోనూ బాబు ఉన్నారు. కానీ గతంలో పొత్తు పెట్టుకుని మోసపోయామని ఆ పార్టీని నమ్ముకుని నిండా మునిగిపోయాము అని, అసలు ఇప్పటి వరకు ఆ ఏపీలో బలంగా
కమలం పార్టీ వేర్లు వేసుకోలేకపోవడానికి కారణం బాబు గారి మహత్యమే అన విషయాన్ని ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా
కమలం పార్టీ వాళ్ళు గుర్తించారు. కాబట్టి మళ్లీ నష్టం జరగకుండా బాబు, ఆయన పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. ఏదో ఒక దశలో దగ్గరవడం ద్వారా ఏపీలో కూటమి పెట్టాలని బాబు గారు పగలు , రాత్రి అనే తేడా లేకుండా కలలు కంటున్నారు.
జనసేనుడు,
బిజెపి మనసును కూడా ఏదో ఒక రకంగా కరగక పోతుందా ? ఏపీలో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లి, మళ్లీ సీఎం కుర్చీలో కూర్చోవాలని పెద్ద పెద్ద ఆశలు పడుతున్నాడు. ఓరి బాబు... ఈ బాబు ఇప్పట్లో మనల్ని వదిలేలా లేడని, వెతికి మరి ఆయన బంధువు అయిన పురంధరేశ్వరికి జాతీయ స్థాయిలో పదవులు కట్టబెట్టి బాబు దగ్గరకు రాకుండా చేసుకున్నారు. అయితే రాజకీయ ఎత్తులకు పై ఎత్తులు వేసే బబోరు ఊరుకుంటారా ఏంటి ? ఇప్పుడు తమ
పార్టీ నాయకులతోనూ, పురందరేశ్వరి ని పొగిడించే పనిలో ఉన్నారు. అయినా ఆమె పాత పగలు మరిచిపోతారా ఏంటి ? పోరు కదా ? అందుకే ఆ యెర్ర పార్టీలు, సేనాని, ఇలా అందరినీ కలుపుకుని కూటమి కట్టే పనిలో ఉన్నారట. ఏమయ్యా బాబు పగటి కలలు కనకయ్యా అంటూ సెటైర్ లు పడిపోతున్నాయి. అయినా పట్టించుకుంటే కదా..?