అప్పుడెప్పుడో పొత్తు పెట్టుకుని నేనే వాడుకుని ఆ కమలం పార్టీ వోళ్ళని వదిలిపారేశా. ఇప్పుదేంటయా అంటే, మా పార్టీవాళ్లతో ఎన్ని రకాలుగా తిట్టించాలో అన్ని రకాలుగానూ తిట్టించి పంపేసా. అసలు నా మీద కోపంతోనే కదా వాళ్ళు ఆ జగన్ గెలిచేలా చేసింది. అంటే ఈ వైసీపీ ఇంత మెజార్టీతో గెలిచింది అంటే, అది నా దయా దాక్షిణ్యాల మీదే. కానీ ఆ జగన్ ఉన్నాడు చూశావూ... అయ్యబాబోయ్ మామూలోడు కాదు. నా వల్ల గెలిచి నన్నే పట్టించుకోవడం మానేసాడు. దిస్ ఈజ్ వెరీ దారుణం అమ్మా ! అదంతా వదిలేయ్ అసలు ఆ బీజేపీ వొళ్ళు ఉన్నారు చూశావూ నిన్ను నమ్ముకునే వాళ్ళు గెలవాలని చూస్తున్నారు.
ఆంధ్రా, తెలంగాణల్లో నీ అవసరం వాళ్ళకి చాలా ఉంది. కానీ అదంతా మర్చిపోయి ఇప్పుడు ఆ బీజేపీ వాళ్ళు రావోయి జగన్ మనం మనం బరంపురం అంటూ పిచ్చకథలు చేస్తారా ? దిస్ ఈజ్ వెరీ దారుణం. అసలు నాకు ఇప్పుడు కడుపు రగిలిపోతుంటే నువ్వు ఏమీ మాట్లాడవేంటి ? ఎలాగూ ఆ కమలం, ఈ ఫ్యానూ పార్టీలు కలిసిపోతాయ్ అందులో డౌటు లేదు. అయినా వాళ్ళు ఇంత కుట్రకు పాల్పడుతుంటే నువ్వెంటయ్యా ? ఇంకా చూస్తూ ఉరుకుంటావేంటయ్యా ? వచ్చేయ్ మనం మళ్ళీ కలిసిపోదాం .. ఈ ఆంధ్రాని ఏలేద్దాం !