అసలు ఎన్నో ఎన్నెన్నో చేద్దాం అనుకుంటే మాకే ఈ జనాలంతా వెన్నుపోటు పొడిచేస్తున్నారు అన్నట్టుగా సినబాబు గారు ఇప్పుడు రంకెలు వేస్తూ హడావుడి మొదలెట్టారు. అమరావతికి పరిమితం కాదు , పార్టీని ఓ చూపు చూస్తాను అంటూ లీడర్లతో మీటింగులు గట్రా పెట్టి మరీ వార్నింగ్ లు ఇచ్చే స్థాయికి సిన బాబోరు వెళ్లిపోయారు. ఇదంతా చూస్తున్న పెద బాబొరిలో ఒకటే ఆనందబాష్పాలు కారిపోతున్నాయట. మొన్నటి వరకూ అందరూ తిడుతుంటే నిజంగానే పండిత పుత్ర ---- అనుకున్నా కానీ, ప్రయోజకుడు అయ్యాడు అంటూ తెగ ఆనందపడిపోతున్నాడట.
ఇంకేముంది హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గడిపేయడమే అంటూ లోకేష్ బాబు తెగ ఆనందపడిపోతున్నాడట. ఇక చిరుత పులిలా అందరి మీద గాండ్రించేందుకు సినబాబు సిద్ధం అయిపోతూ, హడావుడి చేస్తున్నాడు. ఇక పార్టీ నాయకుల్లోనూ సినబాబు మీద ఎక్కడో ఏదో డౌట్ ఉన్నా, తప్పక భరించాల్సిందేలే అన్నట్టుగా భారంగానే సినబాబోరిని మోసేందుకు సిద్ధం అయిపోతున్నారు. ఇక పార్టీని పరుగులు పెట్టించి ఒలంపిక్స్ మెడల్ కొట్టేస్తా ..! శత్రువుల గుండెల్లో గునపాలు గుచ్చేస్తా అన్నట్టుగా పెద్ద హడావుడినే చేసేస్తున్నాడు లోకేశం బాబు. ఇంకేముంది ఇప్పుడు ఆయనకు పార్టీలో మరిన్ని పదవులు ఇచ్చేందుకు సైతం సిద్ధం అయిపోతున్నట్టుగా సిత్ర విసిత్రాలన్నీ చేసేసే పనిలో లోకేశం బాబు ఉన్నారట.