అసలే సినిమాల మీద సినిమాలు చేసేందుకు ఎడాపెడా పవన్ సంతకాలు పెట్టేసారు. ఆ సినిమాలు విడుదల అయ్యి సక్రమంగా థియేటర్లలో ఆడాలంటే, ప్రభుత్వ సహకారం అవసరం. కానీ పవన్ టిఆర్ఎస్ పెద్దలపైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తే ? వారు కత్తి కట్టి తిరిగి పవన్ పైనే బెదిరింపులకు దిగితే ? ఎలా అనేది ఇప్పుడు పవన్ కు అర్ధం కావడంలేదు. అందుకే తాను ఎన్నికల ప్రచారానికి దిగితే, ఆ తర్వాత పరిణామాలు ఏవిధంగా ఉంటాయో అనేది పవన్ కు బాగా తెలుసు. అందుకే కక్కలేక మింగలేక, ఆ బిజెపి నాయకులకు సమాధానం చెప్పలేక, పవన్ పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. దానిని గట్టిగా, మొండిగా చెబితే, ఆ బిజెపి పెద్దలు వినే రకం కాదు.
అటువంటప్పుడు మాతో నీకేం అవసరం ? మీ పొత్తు మాకు అవసరంలేదు అని వారు ఎక్కడ నోరు జారుతారో అనే భయం పవన్ కు ఉంది. ఒక వేళ పొత్తు రద్దయితే, ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడాలో అనే భయం పవన్ లో కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు తెలంగాణలో ప్రచారానికి దిగినా, టిఆర్ఎస్ పెద్దలకు వ్యతిరేకంగా మాట్లాడలేక పవన్ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణలో ఎన్నికలు పవన్ కు సంకటంగా మారాయి.