అసలు తెలుగుదేశం పార్టీలో తానొక్కడినున్నాను అని, నన్ను మీరంతా గుర్తించండయ్యా అంటూ మన చిన బాబు గారు, ఆ పార్టీ వాళ్ళను నెత్తి నోరు కొట్టుకుని మరీ బతిమలాడే పరిస్థితి వచ్చేసిందట. చంద్రబాబు యాక్టివ్ గా ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టి జనాల్లో తిరుగుతున్న సమయంలో ఆయన చుట్టూనే రాజకీయం అంతా నడిచింది. ఇక ఆయన తర్వాత పార్టీలో ఎవరు ఆ బాధ్యతలు తీసుకుంటారో అంటూ ఒకటే హైరానా నడిచినా, అందరూ జూనియర్ ఎన్టీఆర్ జపం కొద్దిరోజులపాటు చేసారు. బాబు మీకో దణ్ణం నన్ను మాత్రం అందులోకి లాగమకండి అంటూ వేసుకోవడంతో ఇంకొన్నిపేర్లు సూచిస్తున్నారు. తప్ప లోకేష్ బాబు పేరును ఎవరూ సూచించకపోవడంతో చిన్న బాబు గారికి చిర్రెత్తుకొచ్చేస్తోంది.


ఏదో రకంగా తాను గొప్ప నాయకుడిని అని  నిరూపించుకోవాలని ఎంతగా ప్రయత్నిస్తున్నా, అసలు ఎవరూ ఆయన్ను పట్టించుకోకపోగా కామెడీగా చూస్తూ సెటైర్లు వేస్తుండడంతో చంద్రబాబుకు మరి మంట పుడుతోంది. ఏదో రకంగా చంద్రబాబు తర్వాత, ఈ తెలుగు సామ్రాజ్యాన్ని ఏలే వ్యక్తిని థానే అంటూ పదేపదే లోకేష్ చెప్పుకుంటున్నా, ప్రయోజనం మాత్రం అస్సలు కనిపించడం లేదు. సర్లే బాబు ఈ సందడి ఎప్పుడూ ఉండేదే కానీ అనుకుంటూ చంద్రబాబు తో పాటు, ఆ పార్టీ నాయకులు ఆయనను తేలిగ్గా తీసేస్తున్నారట. ఇదే ఇప్పుడు చినబాబు కి ఆగ్రహం, ఆవేశం అన్ని కట్టగట్టుకుని వచ్చేలా చేస్తున్నాయి.


 తన పరిస్థితి ఈ విధంగా ఉంది అనుకుంటున్న సమయంలో ఇప్పుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా రావడం తనకంటే అన్నిటిలోనూ పై చేయి సాధించగలిగిన సత్తా ఉన్న అచ్చెన్న భయం బాబు ని వెంటాడుతోంది. రాబోయే రోజుల్లో తనను డామినేట్ చేసి అచ్చన్న బలం పెంచుకుంటే, అప్పుడు తన పరిస్థితి ఏంటని తలుచుకుని చినబాబు గుబులు చెందుతున్నాడట. అసలే తన పరిస్థితి ఏం బాలేదని, పార్టీలో ఎవరూ తనను నమ్మే పరిస్థితిలో లేరని, అటువంటప్పుడు తనకంటే అన్ని విషయాల్లోనూ మెరుగైన వాడిగా నిరూపించుకుంటూ వస్తున్న అచ్చెన్నతన కంటే బలం పెంచుకుంటే అప్పుడు తన పరిస్థితి ఏంటి అనే బెంగ చినబాబులో ఎక్కువయిపోయిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: