ప్రత్యేక ట్రైనింగ్ తీసుకుని, స్పీచ్ లు ప్రాక్టీసు చేయించి , సన్నగా, నాజూగ్గా తయారు చేయించి మరీ ఈ మధ్యనే చినబాబు ని బాగా యాక్టివ్ చేసేసారు. ఏదిి ఏమైనా సరే, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అనేది రాకుండా చేయాలని ,ఈ విషయంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని అభిమన్యుడు మాదిరిగా దాటుకుని, అధికారం సాధించి పెట్టి చిన్న బాబుని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని పెదబాబు తన శక్తినంతా కూడదీసుకుని వారి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో రకంగా పార్టీని ఒడ్డున పడేసి , కృష్ణ రామ అ అనుకుంటూ కాలక్షేపం చేయాలని చూస్తున్నారు. అందుకోసమే పార్టీని ప్రక్షాళన చేసి సైకిల్ పార్టీ కి రిపేర్లు చేయాలని గట్టిగానే కష్టపడుతున్నారు .



సొంతంగా చిన బాబు కు సన్నిహితమైన వారితో టీమ్ ను కూడా ఏర్పాటు చేసి, ఆయనకు ఇబ్బంది లేకుండా చేయాలని చూస్తున్నారు. అయితే అది అంత ఆషామాషీ వ్యవహారం కాకపోయినా గట్టిగానే, పెద బాబు కష్టపడుతున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే అకస్మాత్తుగా చిన బాబు మేనమమ, ప్లస్ మామ గారు అయినా బాలయ్య బాబు ఎంట్రీ ఇచ్చేశారు. ఇప్పుడు పార్టీలో తెరవెనుక ఎవరికి తెలియకుండా గట్టిగానే పట్టు పెంచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట.


అంతేనా రాబోయే రోజుల్లో తనదే అని, సీఎం అనే దర్పం ప్రదర్శిస్తూ, ఇప్పటి నుంచే అన్ని మార్గాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ తన అల్లుడికి ఆ పదవి దక్కక పోతే ఆ కుర్చీలో కూర్చొనే అర్హతలు ఉన్న వ్యక్తిని తానే అన్నట్లుగా అప్పుడే గట్టి గట్టి ప్రయత్నాలు ఎన్నో చేస్తుండడంతో ఇదంతా మన మంచికే అని ఒకవైపు , తన సీఎం కుర్చీ కి ఎసరు పెట్టే కార్యక్రమానికి మరోవైపు శ్రీకారం చుట్టి, అల్లుడికి వెన్నుపోటు పొడుస్తాడు అనే భయం ఇప్పుడు తండ్రి కొడుకుల లో పెరిగి పోయిందట. కొంపదీసి తమ తండ్రికి జరిగిన అవమానం గుర్తుకు వచ్చి తన బావ, తన అల్లుడికి వెన్నుపోటు పొడిచేందుకు కొత్త  ఎత్తులు వేస్తున్నాడా అనే డౌట్ తో కూడిన అనుమానం తండ్రి కొడుకులకు వచ్చేసినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: