రాజకీయాల్లో కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ భలే క్యామిడి చేస్తున్నారు. నివర్ తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడేందుకు పవన్ బుధవారం పర్యటించారు. గన్నవరం విమానాశ్రయంలో విమానం దిగిన తర్వాత పవన్ నేరుగా పామర్రు, కంకిపాడు, అవనిగడ్డ ప్రాంతాల్లో పర్యటించారు. పంటలను చూసిన తర్వాత రైతులను పారమర్శించారు. ఇంతవరకు పవన్ చేసిన దాంట్లో తప్పేమీలేదు. కానీ పరామర్శపేరుతో రైతులతో పవన్ మాట్లాడిన మాటలు, ఇచ్చిన హామీలే మరీ క్యామిడిగా ఉన్నాయి. కొన్ని సినిమాల్లో కూడా పవన్ హాస్య పాత్రలను పోషించిన విషయం అందరికీ తెలిసిందే. కానీ నిజజీవితంలో కూడా అందులోను రాజకీయాల్లో కూడా హాస్యాన్ని పండించగలడని ఇపుడే అందరికీ అర్ధమయ్యుంటుంది.




ఇంతకీ విషయం ఏమిటంటే తాను భరోసా ఇచ్చేందుకు వచ్చినట్లు రైతులతో మాట్లాడినపుడు పవన్ చెప్పారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్ధికసాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు. రైతులెవరు అధైర్య పడద్దంటూ కాసేపు ఓదార్చటమే విచిత్రంగా ఉంది. రైతులకు భరోసా ఇచ్చేందుకు తాను పంటలను చూడటానికి వచ్చానని చెప్పుకున్నారు. ఏ విధంగా భరోసా ఇవ్వగలరో మాత్రం చెప్పలేదు. రాజకీయాలను పార్ట్ టైం యాక్టివిటిగా మార్చేసుకున్న పవన్ ఏ సమస్య మీద కూడా పరిష్కారం కోసం పోరాడిన చరిత్రలేదు. ఏదో బుద్ది పుట్టినపుడు నోటికొచ్చింది మాట్లాడేయటం, స్టేజి మీద పూనకం వచ్చినట్లు ఊగిపోతు డైలాగులు చెప్పేసి మాయమైపోతారంతే. మళ్ళీ సదరు సమస్యపై ప్రస్తావిస్తే ఒట్టే. అమావస్యకో పౌర్ణమికో కనబడే పవన్ కూడా రైతులకు భరోసా ఇచ్చేయటమే క్యామిడిగా ఉంది.




పైగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు ఆర్ధికసాయం అందేలా కృషి చేస్తానని చెప్పటం కూడా విడ్డూరంగానే ఉంది. జరిగిన పంటల నష్టంపై సర్వేలు చేసి నివేదికను డిసెంబర్ 15వ తేదీలోగా ఇవ్వాలని జగన్ ఆదేశించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వానికి నివేదిక అందగానే డిసెంబర్ 31వ తేదీలోగా రైతులకు నష్టపరిహారాన్ని అందిస్తానని స్వయంగా జగనే అసెంబ్లీలో చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వమే డిసెంబర్ 31ని డెడ్ లైనుగా పెట్టుకుంటే ఇక పవన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టేదేముంది ? ఏదో ‘సత్రం కూటికి అయ్యవారి చీటి’ సామెతలాగుంది పవన్ చెప్పిన మాటలు. చంద్రబాబునాయుడు హయాంలో పంటలకు నష్టాలు జరిగినపుడు ఇదే పవన్ ఎక్కడికి వెళ్ళారో ఎవరికీ తెలీదు. అప్పట్లో నష్టపరిహారంపై రైతులు నెత్తీ నోరు మొత్తుకున్నా చంద్రబాబు పట్టించుకోలేదు. మరి ఇపుడిస్తానంటున్న భరోసా ఆనాడు పవన్ ఎందుకివ్వలేకపోయారు ? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఉరుక్కుంటు వచ్చేసే వపన్ తాజా పర్యటనలో పిచ్చ క్యామిడి చేసేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: