మీడియాల యందు పసుపు మీడియా వేరయా అన్నట్లుగా సెంద్ర బాబు తప్ప ఎవరు రాజకీయంగా పైకి ఎదిగినా, తట్టుకోలేక వారి పతనం చూడందే నిద్ర రాదు .. నిద్ర పోను అన్నట్లుగా వ్యవహరించే ఓ వర్గం మీడియా ఇప్పుడు అకస్మాత్తుగా జనసేనాని పై ప్రేమ, ఆప్యాయతలు అంతకంటే ఎక్కువగా కవరేజ్ ఇస్తూ, పాజిటివ్ కథనాలను ప్రచురిస్తూ, హడావుడి చేస్తుండటం వెనుక కారణాలు ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఒకరకంగా జన సైనికులకు సైతం ఈ ఆకస్మిక ప్రేమ వెనుక ఉన్న రాజకీయం ఏమిటో తెలియక తెగ హైరానా పడిపోతున్నారు. ప్రస్తుతం రైతులను పరామర్శిస్తూ , వారిని ఓదార్చి, వారి సానుభూతిని సంపాదిస్తూ, రాజకీయంగా తనకు ఉన్నత అవకాశం దక్కే విధంగా పవన్ ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.
పవన్ ఈ పర్యటన ను ఎంతో ఉత్సాహం చూపిస్తూ, జన సైనికుల కంటే ఎక్కువగా సంబరపడిపోతూ,
మహా ఆనందం పొందుతున్న సదరు మీడియాను పొగడాలో, లేక లేక ప్రశంసలు కురిపిస్తూ, భజన చేయాలో తెలియక జన సైనికులు సైతం హైరానా పడిపోతున్నారు. అసలు
పవన్ ను
జనసేన పార్టీ పెట్టిన మొదట్లో కాస్త హైలెట్ చేస్తూ ,
పవన్ గొప్ప నాయకుడని, ఆయన ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్తారు అంటూ కథనాలు వండి వార్చి జనాలకు వడ్డించారు. దీంతో అప్పట్లో ఉబ్బి తబ్బిబ్బి అయిపోయిన జనసేనుడు ఆ తర్వాత ఒక్కసారిగా అమాంతం పాతాళానికి అదే
మీడియా తొక్కడంతో, ఏం జరుగుతుందో తెలియక ఎంతో గందరగోళం కు గురయ్యారు. అప్పట్లో బాబుకు మద్దతుగా నిలవడంతో భజన సాగిందని , ఇప్పుడు ఒంటరిగా ఉన్నాము కాబట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని
పవన్ ఆలస్యంగా అప్పట్లో తెలుసుకున్నారు. అయితే ఇప్పటికీ
పవన్ టిడిపికి దూరంగానే ఉంటూ, బీజేపీతో కలిసి ముందుకు వెళుతున్నారు. రైతు
యాత్ర సొంతంగానే
జనసేన తరపున చేస్తున్నారు.
టీడీపీ అనుకూల
మీడియా ఈ విధంగా ఆకాశానికి ఎత్తేస్తూ, పొలిటికల్
హీరో అంటూ భజన చేస్తూ,
అసెంబ్లీ సమావేశాలు సైతం పక్కన పెట్టేసి వ్యవహరిస్తున్న తీరు వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ అంతు పట్టడం లేదు.
కొంపదీసి అటూ ఇటూ తిప్పి చివరికి
టిడిపి తో జత కలిసే విధంగా
పవన్ కు లింక్ పెట్టి, పవన్ ను రాజకీయంగా మరోసారి ఇరికించే ప్రయత్నం సదరు
మీడియా చేస్తుందా అనే అనుమానాలు సైతం జనసైనికులో కనిపిస్తున్నాయి. ఏమో ఈ మీడియాను అస్సలు నమ్మలేం.