బాబును చూసి .. వాపును చూసి బలుపు అనుకుంటున్నారో ఏమో గాని తెలంగాణ తమ్ముళ్లు... ఆ తమ్ముళ్ళను నడిపిస్తున్న అన్నాయ్ లు. తమకు తెలంగాణలో బలం , బలగం రెండు లేవని , గొప్పగా చెప్పుకోవడానికి పార్టీ ఉంది తప్ప అంత ఇరగదీసే కార్యక్రమాలు చేసేందుకు కానీ, టిఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు , ఇరగదీసే కార్యక్రమాలు ఏవి లేవు అని తెలిసినా, ఎక్కడలేని హడావుడి చేస్తూ... బలం, బలగం ఉంది అని నిరూపించుకునేందుకు , తమది జాతీయ పార్టీ అని గొప్పగా చెప్పుకుంటూ గొప్పలు పోయేందుకు అన్నట్లుగా వ్యవహరిస్తూ వస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఏపీ లోనే సీన్ అంతంతమాత్రంగా ఉన్న సమయంలో తెలంగాణలో పోటీ చేసి అనవసరంగా పోటీలో దిగిన అభ్యర్థులకు, సొమ్ములు ప్రతిష్టులు పోయే విధంగా వ్యవహరిస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడే విధంగా చేస్తూ, వారిని పరోక్షంగా ఇబ్బందులపాలు చేస్తూ వస్తుండడం పై సర్వత్రా విమర్శలు వస్తూనే ఉన్నాయి.
తెలంగాణలో
పార్టీ పేరు చెప్పి నాయకులను ఇబ్బందుల పాలు చేసే కంటే , దుకాణం మూసేస్తే బెటర్ అన్న అభిప్రాయం వస్తున్నా, బాబు గారి లో మాత్రం ఎక్కడా కదలిక లేదు. గ్రేటర్ లో పోటీకి అభ్యర్థులను దింపి , వారికి డిపాజిట్ కూడా దక్కక ఎంతగానో అభాసుపాలు అయ్యారు. పార్టీని నమ్ముకుని ఈ విధంగా వారు అభాసుపాలు అయ్యారు. ప్రత్యక్షంగానూ , పరోక్షంగానూ టిడిపికి అవమానం అయినా, అక్కడ
పార్టీ ని అధికారంలోకి తీసుకొచ్చే అంత సామర్థ్యాలు లేకపోయినా, బాబోరు మాత్రం గంభీరంగా గొప్పలు పలకడం మాత్రం మానడం లేదు. అసలే ఈ మధ్యకాలంలో ఏపీలో
పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అందుకే తెలంగాణలోనూ, అటు ఆంధ్రా లోనూ, కమిటీల పేరుతో హడావుడి చేసినా, కొత్త కమిటీలు వల్ల పెద్దగా ఉపయోగం కనిపించలేదు అనేది టాక్.
అయినా బాబోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు.
అసెంబ్లీ ఆయన ప్రవర్తన చూస్తే ఇంత ఫైర్ ఎక్కడది ? ఇంతగా అవేశం కట్టలు తెంచుకుంటోందా ? అస్సలు వయస్సు మీద పడినా, ప్రళయం వచ్చి పడిపోతున్నా బాబోరు మాత్రం అస్సలు తగ్గడం లేదు.