రెండు పార్టీల మధ్య పొత్తు పొడిచిన సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే , రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. రెండు పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నా, విడివిడిగానే వ్యవహరిస్తున్న తీరు జన సైనికులకు అర్థంకాని పరిస్థితి ఏర్పడింది.
పవన్ అనుమానాస్పదంగా వ్యవహరిస్తూ వస్తుండడం, రాజకీయాలలో క్లారిటీ లేకుండా ప్రవర్తించడం వంటివి
జనసేన వర్గాలకు లోలోపల ఆందోళన కలిగిస్తున్నా, పైకి మాత్రం అంతా బాగానే ఉంది అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు .
ఇక
పవన్ ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు కోసమే ప్రయత్నిస్తున్నారు తప్ప , సొంతంగా బలం పెంచుకునే దిశగా అడుగులు మాత్రం వేయలేకపోతుండడం జన సైనికులను నిరాశ నిస్పృహలకు గురి చేస్తోంది. మొదట్లో
టిడిపి బిజెపి లతో సఖ్యత గా ఉంటూ అదే పనిగా పొగుడుతూ వచ్చిన సేనాని , ఆ తర్వాత రెండు పార్టీలపై విమర్శలు చేశారు. ఇప్పుడు చూస్తే బీజేపీని పొగిడి మళ్లీ ఆ పార్టీని దూరం పెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు.