తిరుపతిలో పోటీ మేము చేస్తున్నాము అని కాషాయ పార్టీ చెప్పడమే కాదు, వారు వ్యవహరిస్తున్న తీరు సైనికులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీనిపై బహిరంగ ప్రకటన చేయకుండా, కళ్యాణ్ సార్ నివేదికను కేంద్రానికి అంటే కాషాయ పార్టీ పెద్ద నేతలకు పంపడంతో, ఇప్పుడు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారో తెలీదు. మరోవైపు చూస్తే కాషాయ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాత్రం కళ్యాణ్ సార్ ను పక్కన పెట్టేసి మరి ముందుకు దూసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న తీరు మరింత కంగారు పెట్టేస్తుంది .బిజెపి వ్యవహారం చూస్తుంటే ముందు ముందు తమకు అవకాశం ఇచ్చేలాగా కనిపించడం లేదా అనే అనుమానం సైనికుల్లో వచ్చేసింది.
అయితే కళ్యాణ్ సార్ మాత్రం ఇంకా మొహమాటం పడుతూ వస్తున్నాడు. సైనికులకు ఇది మరింత అసహనం కలిగిస్తుంది. అయినా ఎందుకుకళ్యాణ్ సార్ మాత్రం ఇంకా ఇంకా ఏదో మరేదో కాషాయం పార్టీ నుంచి ఆశిస్తున్నట్లు కనిపిస్తున్నారు. సైనికులు మాత్రం ఇంకెందుకు ఈ అవమానాలు బయటకు రా అన్నాయ్ అంటూ పిలుపునిస్తున్నారు.