ఈ అనుమానం మాకు రాలేదు. కానీ నారా లోకేష్ మాత్రం తమిద్దరి స్ధయి ఒకటే అని అనుకుంటున్నారు. అందుకనే తాను జగన్మోహన్ రెడ్డికి సవాలు విసిరితే విజయసాయిరెడ్డి సమాధానం చెప్పటం ఏమిటంటు ఎగతాళి చేస్తున్నారు. తనపై జగన్ చేస్తున్న, చేయిస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని సింహాద్రి అప్పన్న ఆలయంలో ప్రమాణం చేయటానికి సిద్ధం..జగన్ సిద్ధమా ? అంటు ట్విట్టర్ వేదికగా పెద్ద చాలెంజినే లోకేష్ విసిరారు. దానికి విజయసాయిరెడ్డి సమాధానం ఇస్తే ఎగతాళిగా మాట్లాడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లోకేష్ ను కాదు కదా అసలు చంద్రబాబునే తన ప్రత్యర్ధిగా జగన్ పరిగణించటం లేదు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా చంద్రబాబు గురించి జగన్ మాట్లాడింది చాలా తక్కువని అందరికీ తెలిసిందే. ఎందుకంటే జగన్ మీడియాతో మాట్లాడటమే  చాలా తక్కువ. చంద్రబాబు, లోకేష్ లాగ 24 గంటలూ మీడియాలో కనబడాలనే పిచ్చి జగన్ కు లేదు. కాబట్టే అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో జగన్ మీడియాతో మాట్లాడింది మహాఅయితే ఓ మూడుసార్లుంటుందంతే.




మరి ఇదే సమయంలో ఒక్కరోజు కూడా మీడియాలో కనబడకపోతే చంద్రబాబు బతకలేడు. మీడియా ప్రచారమే ఊపిరిగా చంద్రబాబు బతుకుతున్నాడు. ఇక తండ్రిబాటలోనే లోకేష్ కూడా ట్విట్టర్ లో ఆరోపణలు, విమర్శలతో గడిపేస్తున్నాడు. ఇటువంటి లోకేష్ కూడా తానను తాను జగన్ కు సమానమైన ప్రత్యర్ధిగా అనుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఒంటిచేత్తో వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చిన జగన్ కెపాసిటి ఏమిటి ? అధికారంలో ఉండి కూడా మంగళగిరిలో ఓడిపోయిన లోకేష్ కెపాసిటి ఏమిటి ? నిజానికి లోకేష్ ఎంఎల్సీ అయ్యిందే దొడ్డిదోవన. ముందుగా మంత్రయిపోయి తర్వాత ఎంఎల్సీ అయిపోయారు. అప్పట్లోనే గెలుపుపై అంత నమ్మకమే ఉండుంటే ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటి చేసుండేవారే కదా.




ఎంఎల్ఏగా పోటీ చేయకుండా ఎంఎల్సీ అయ్యారంటేనే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంత భయపడ్డారో అర్ధమైపోయింది. అదే భయం మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిలో ఎంఎల్ఏగా పోటీ చేసినపుడు నిజమైపోయింది. అనేక సర్వేలు చేయించుకుని ఏరికోరి మంగళగిరిని ఎందుకున్నారు. చివరకు అక్కడే 16 వేల ఓట్లతో ఓడిపోయారంటేనే లోకేష్ కెపాసిటి అర్ధమైపోలా ? అలాంటి చినబాబు కూడా తనని తాను జగన్ తో సమానస్ధాయిగా ఊహించుకోవటమే విచిత్రంగా ఉంది. చాలామంది మంత్రులు అసలు లోకేష్ ను ఓ నాయకునిగానే పరిగణించటం లేదు. అలాంటిది జగన్ పట్టించుకుంటారా ? తండ్రి, కొడుకుల సమస్యేమిటంటే తాము ఎన్ని ఆరోపణలు చేసినా జగన్ సమాధానం చెప్పటం లేదనే. ఆ ఉక్రోషంలో నుండే జగన్ పై చంద్రబాబు, లోకేష్ నోటికొచ్చినట్లు మాట్లాడేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: