అయ్యో పాపం ఈ రేంజ్ లో తండ్రి కొడుకులు ఇద్దరూ బలయ్యారా ? అనవసరంగా జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడం ఎందుకు నానితో తిట్టించుకోవడం ఎందుకు అంటూ సెటైరికల్ గా సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంటారు. అసలు నాని లాంటి వారు ఉపయోగించిన పదజాలంతో ఇంకెప్పుడు ఆయన జోలికి వెళ్ళకూడదని, ఆయనకు దూరంగానే ఉంటూ ఎన్ని విమర్శలు చేసినా, కనీసం స్పందించకుండా మౌనంగానే ఆ తిట్లను భరిస్తూ వస్తున్నారు. అయితే జగన్ పైన రాజకీయ కక్ష తీర్చుకునేందుకు మాత్రం సత్యాలు, అసత్యాలు అన్నిటినీ జనాల ముందుకు తీసుకువచ్చి అదేపనిగా ప్రభుత్వంపై వర్షం కురిపిస్తూ ఉండడంతో వారికీ నాని షాక్ గట్టిగానే తగులుతుంది.
దీంతో ఓ రేంజ్ లో తిట్టిపోస్తున్నారు. అయినా వాటిని తుడుచుకొని మరి యధావిధి గానే ఉంటున్నారు. కాకపోతే వ్యక్తిగతంగా నాని చేసిన వ్యాఖ్యలు జనాల్లో చర్చనీయాంశం అవుతుండటం, చంద్రబాబు క్యారెక్టర్ నిజంగా ఇదే కదా...! నాని అన్న దాంట్లో తప్పేముంది అన్న విధంగా చర్చ జరుగుతుంది. అసలు 40 ఏళ్ల రాజకీయం, సీనియర్ అని చెప్పుకుంటూ గొప్పగా తిరుగుతున్న బాబు గారికి ఆయన కుమారుడికి ఈ తిట్లు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. తాజాగా రామతీర్థం ఘటన వ్యవహారంలో జగన్ పై విమర్శలు చేసిన లోకేష్ ,చంద్రబాబుకు నాని ఎంత డోస్ ఇవ్వాలో అంత డోస్ గట్టిగానే ఇచ్చేశారు.