నటసింహం ... రాజకీయ సింహంగా ఎప్పుడో మారిపోయినా, ఇప్పుడు గట్టిగా గర్జించ కపోతే సీన్ సితార్ అయ్యింది అని అర్థమైంది. అల్లుడు పార్టీ బాధ్యతలు మోసే రేంజ్ లో లేడని అర్థమైపోయింది. ఆ విషయం అందరికీ తెలిసినా ఎవరు నోరు మెదపడం లేదు. అల్లుడికి బాధ్యతలు అప్పగిస్తే జరిగే నష్టం ఏంటో సీమ సింహాకు బాగా తెలుసు కాబట్టి, వాళ్ళు వీళ్ళు ఎందుకు బాబుగారి రాజకీయ వారసుడిగా బాలయ్య కరెక్ట్ అని పార్టీ వాళ్లతోనూ, జనాలతోనూ డిమాండ్ చేయించాలి అని ఈ నరసింహ రంగంలోకి దిగిపోయాడు. శాంపిల్ గా తన సొంత నియోజకవర్గంలో మంత్రి కొడాలి నాని వంటి వారిపై సమరసింహారెడ్డి డైలాగులు చెప్పారు. ఆ డైలాగులకి ఊహించని రేంజిలో రెస్పాన్స్ వచ్చిందని ఆయనలో ఆయన భావించి నరసింహనాయుడు, సమరసింహారెడ్డి లెజెండ్ ఇలా అందరినీ గుర్తుచేసుకుని భారీ డైలాగులతో విరుచుకుపడేందుకు గట్టిగానే ప్లాన్ వేసుకున్నారు.
అప్పుడప్పుడు అభిమానులపై ఏవిధంగా తన వీర ప్రతాపం చూపిస్తారో ఇస్ప్పుడు అదే విధంగా చూపించేందుకు రెడీ అయిపోతున్నారు. అసలు రెండోసారి గెలిచినా సైలెంట్ గానే ఉండి, ఇంత కాలం
తండ్రి కొడుకులు ఇద్దరిని
వైసీపీ మంత్రులు చెడామడా తిట్టి పోస్తున్న మౌనంగానే ఉన్న నటరత్న పెర్ఫార్మెన్స్ మెరుగుపరచు ఉంటారని అవకాశం వ ఇచ్చేశారు. అబ్బే అస్సలు ఏమాత్రం మార్పు లేదు సరికదా, తాను రంగంలోకి దిగక పోతే మొత్తం
సైకిల్ మూలన పడేలా ఉంది అని భావించి ఇప్పుడు తొడ కొట్టేందుకు సిద్ధమైపోయారు. కానీ బావ పర్మిషన్ తీకుండా తొడగొడితే అల్లుడికి కోపం వస్తుందేమో అనే భయంతో.... తోడగొట్టమంటావా బావా అంటూ పర్మిషన్ అడుగుతున్నాడు ఈ
అల్లరి పిడుగు.