పాపం చంద్రబాబునాయుడును జనాల్లో పాజిటివ్ గా ప్రొజెక్టు చేయలేక ఎల్లోమీడియా నానా అవస్తలు పడుతోంది. ఎల్లోమీడియా ఎంతగా లేపుదామని ప్రయత్నిస్తున్నా అక్కడ సరుకు లేకపోవటంతో ఏమి చేయలేకపోతోంది. ఇందుకు తాజాగా జరిగిన ఘటనే నిదర్శనం. హైదరాబాద్ నుండి సోమవారం ఉదయం చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో నుండి చంద్రబాబు బయటకు రావటానికి పోలీసులు అంగీకరించలేదు. దాంతో చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోతు నానా రచ్చ చేశారు. నిజానికి  కేవలం ప్రచారం కోసమే చంద్రబాబు రేణిగుంటకు వచ్చారు, రచ్చ చేశారు. దాదాపు పదిగంటల డ్రామా తర్వాత తిరిగి హైదరాబాద్ కు వెళ్ళిపోయారు.




చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో ఆందోళన కార్యక్రమాలకు టీడీపీ నేతలు పోలీసులను అనుమతులు అడిగారు. అందుకు పోలీసులు నిరాకరించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వల్ల ఎలాంటి నిరసనలు చేసేందుకు లేదని చెప్పారు. పోలీసులు అనుమతి నిరాకరిస్తారని చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే అనుమతి నిరాకరించగానే రేణిగుంటకు చేరుకున్నారు. అంటే కావాలనే రబస చేసేందుకు ముందుగా నిర్ణయించుకునే రేణిగుంటకు చేరుకున్నట్లు తెలిసిపోతోంది. అయితే అసలు సమస్యంతా ఎల్లోమీడియాకు ఇక్కడే మొదలైంది. అదేమిటంటే చంద్రబాబు మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, భోజనం చేయలేదు, కటికనేల మీదే బైఠాయించారంటూ రోజంతా ఒకటే ఊదరగొట్టింది. కానీ అందులో చాలా వరకు తప్పని తేలిపోయింది.




చంద్రబాబు నేలపైన కూర్చున్నది కొద్దిసేపే. మళ్ళీ లాంజ్ లోకి వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. భోజనం తీసుకున్నారు. మంచినీళ్ళు కూడా తాగుతునే ఉన్నారు. కానీ ఎల్లోమీడియా మాత్రం చంద్రబాబు కఠోర తపస్సు చేస్తున్నారన్నంగా బిల్డప్ ఇచ్చేసింది. తీరా చూస్తే ఆ ప్రచారమంతా ఉత్త అబద్ధాలే అని తేలిపోయింది. ఎందుకంటే సోఫాలో కూర్చుని చంద్రబాబు పోలీసులతో మాట్లాడుతున్న ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. అలాగే ఆయన కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్ కూడా కనబడింది. ఇంకెవరి వాటర్ బాటిలో అయితే చంద్రబాబు కాళ్ళ దగ్గర ఉండే అవకాశమే లేదు. భోజనం చేసినట్లు పోలీసులే చెప్పారు. కాబట్టి చంద్రబాబు ఆందోళనను పాజిటివ్ గా ప్రొజెక్టు చేసేందుకు ఎల్లోమీడియా గంటలపాటు నానా అవస్తలు పడినా చివరకు అదంతా తేలిపోయింది పాపం.


మరింత సమాచారం తెలుసుకోండి: