దశాబ్దాల పాటు చంద్రబాబునాయుడును భుజాన మోసి తప్పుదోవ పట్టించిన ఎల్లోమీడియా యాజమాన్యం తాజాగా టీడీపీ అధినేతను అన్ పిట్ అని తేల్చేసింది. చంద్రబాబు అంటే నేతల్లో గౌవరం, భక్తీ లేకపోవటమే కాకుండా కనీసం భయం కూడా లేదని తేల్చేసింది. మరి గౌరవం, భక్తి, భయం లేని నేతలు చంద్రబాబును ఎందుకు లెక్కచేస్తారని అమయాకంగా ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది. చంద్రబాబు అంటే నేతల్లో భక్తి, గౌరవం, భయం లేదని తెలుగుసుకోవటానికి ఎల్లోమీడియాకు ఇన్ని సంవత్సరాలు పట్టిందా ? ఎల్లోమీడియా చెప్పిన గౌరవం, భక్తి, భయం నేతల్లో ఎందుక లేదు ? దీనికి కూడా ఎల్లోమీడియానే సమాధానం చెప్పింది.




ఎందుకంటే అవసరానికి వాడుకుని తర్వాత వదిలేస్తారనే అభిప్రాయం చంద్రబాబుపై నేతలందరిలోను బలపడిపోయిందట. అందుకనే పార్టీ కష్టకాలంలో ఉన్నపుడు చొక్కాలు చించుకుని పనిచేయాలని ఎవరికీ అనిపించలేదని ఎల్లోమీడియా తేల్చేసింది. అధికారంలో ఉన్నపుడు పార్టీని, రాజకీయాలను చంద్రబాబు గాలికొదిలేసిన కారణంగానే ఇఫుడు ఈ దుస్దితి ఏర్పడిందని చెత్తపలుకులో ఎల్లోమీడియా చెప్పింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, జగన్మోహన్ రెడ్డిలో ఉన్న తెగువ, నేతలను కాపాడుకోవటంలో చంద్రబాబులో లేదని చెత్తపలుకు తేల్చిచెప్పేసింది. చంద్రబాబులో అనేక లోపాలున్న కారణంగానే ఇపుడు పార్టీ బాగా వీకైపోయిందని ఫైనల్ చేసేసింది. నిర్ణయాలు తీసుకోవటంలో విపరీతమైన జాప్యం, పార్టీకి నష్టం చేసే వారిపై చర్యలు తీసుకోలేకపోవటం చంద్రబాబు బలహీనతగా ఎల్లోమీడియా స్పష్టంచేసింది.




చివరగా ఎన్టీయార్ వేసిన పునాది వల్లే టీడీపీ నాలుగు దశాబ్దాల పాటు నిలబడిందనే నిజాన్ని ఇంతకాలానికి అంగీకరించింది. అంటే పార్టీ బలోపేతానికి చంద్రబాబు చేసిందేమీ లేదని ఎల్లోమీడియా ఒప్పుకున్నది. పార్టీకి కొత్తరక్తం అవసరమని సూచించింది.  ఇప్పుడు గనుక పార్టీకి కొత్తరక్తం ఎక్కించకపోతే అంతే సంగతులని కూడా తీవ్రంగానే హెచ్చరించింది. తనపట్ల కనీస గౌరవం లేని వాళ్ళని బయటకు తరిమేయమని సూచించటమే ఆశ్చర్యంగా ఉంది. వాడుకుని వదిలేస్తారనే అపవాదును మోస్తున్నంత కాలం చంద్రబాబుకు సమస్యలు తప్పవని తీవ్రంగానే హెచ్చరించింది. గౌరవం లేనివాళ్ళని ఎంతకాలం మోస్తారు ? అని అడగటంలో అర్ధంలేదు. ఎందుకంటే చంద్రబాబేమీ జనాల్లో నుండి పుట్టిన నేత కాదు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడికి ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీని లాక్కున్న నేత. వెన్నుపోటు సమయంలో తనకు సహకరించని వారిని జీవితాంతం మొయక వేరేదారిలేదు. అలాకదంటే వాళ్ళంతా అప్పట్లో ఏమి జరిగిందనే విషయంలో నోరిప్పితే చంద్రబాబు పనిగోవిందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: