రాజకీయ జోస్యాలు చెప్పటంలో ఈ అవుట్ డేటెడ్ నేత ఆంధ్రా ఆక్టోపస్ గా పాపులర్ లేండి. రాజకీయ జోస్యం అంటే ఏమీలేదు. ప్రతి విషయంలోనే చంద్రబాబునాయుడును సమర్ధించటం, జగన్మోహన్ రెడ్డిపైన ఎంత వీలుంటే అంత బురదచల్లేయటం. ఎలాగూ జగన్ పై బురదచల్లేవాళ్ళకు ఎల్లోమీడియా పెద్దపీట వేస్తుంది కాబట్టి ఆంధ్రా ఆక్టోపస్ గా చెలామణి అయిపోతున్నారు. ఈయన చెప్పిన జోస్యాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజమైన దాఖలాల్లేవు. అయినా ఎల్లోమీడియా భుజనా మోస్తోంది కాబట్టి ప్రతిరోజు మీడియాలో నోటికొచ్చిందేదో మాట్లాడేస్తుంటారు. తాజాగా ఆయన ఎల్లోమీడియాలో మాట్లాడుతూ తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీకి వైసీపీ లోపాయికారీగా మద్దతిచ్చినా ఆశ్చర్యపోవక్కర్లేదట.




అసలు బీజేపీకి జగన్ ఏ విధంగా మద్దతిస్తారు ? పైగా లోపాయికారీగా ఒప్పందం చేసుకున్నట్లు చెప్పేశారు. అంటే బీజేపీ, వైసీపీ ఒకటే అని ఈ ఆక్టోపస్ జనాలకు చెప్పదలచుకున్నారు. గతంలో కూడా బీజేపీ+టీడీపీ మిత్రపక్షాలుగా ఉన్నపుడు కూడా జగన్ కమలంపార్టీతో కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పెద్దఎత్తున ప్రచారం చేసింది ఎల్లోమీడియా.  బీజేపీతో జగన్ చేతులు కలపటం వల్ల మైనారిటీలంతా వైసీపీకి వ్యతిరేకంగా తయారవుతున్నారని పదే పదే ఊదరగొట్టారు. బీజేపీతో జగన్ కలిస్తే వైతిరేకమైన మైనారిటిలు, మరి చంద్రబాబుకు వ్యతిరేకం అవ్వరా ? లేకపోతే అయ్యారా ? అనే కామన్ సెన్సు పాయింట్ ను కూడా ఆలోచించలేదు. జనాలకు వాస్తవాలు ఏమిటో తెలుసుకాబట్టే ముస్లిం మైనారిటిలు మొన్నటి ఎన్నికల్లో  టీడీపీ గూబపగలగొట్టారు.




ఇపుడు కూడా నరేంద్రమోడిపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను వైసీపీ మీద మళ్లించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుంది ఎల్లోమీడియా+టీడీపీ+ఆక్టోపస్. అందుకనే బీజేపీ, జగన్ మధ్య లోపాయికారీ ఒప్పందమనే బురదచల్లుడు మొదలైంది. నిజానికి ఇలాంటి లోపాయికారీ ఒప్పందం బీజేపీ, చంద్రబాబు మధ్య ఉంటందనే ప్రచారం అందరికీ తెలిసిందే. కమలంపార్టీతో లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకోవటం చంద్రబాబుకే ఎక్కువ అవసరం. ఎందుకంటే మోడికి దగ్గరవ్వాలని చంద్రబాబు తెగ ప్రయత్నిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు బండారం ఎక్కడ బయటపడుతుందో అనే ఆందోళనను కప్పిపుచ్చుకుని దాన్నిజగన్ పై తోసేసే ప్రయత్నాలు మొదలయ్యాయని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: